మెగా న్యూస్: చిరు మూవీలో పవన్ కళ్యాణ్, అరగంట పాటు అన్నయ్యతోనే...?
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు సంబంధించి ఆసక్తిక విషయం వెలుగులోకి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర అరగంట పాటు ఉంటుందట.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే అభిమానులకు పండగే. గతంలో అన్నయ్య నటించిన కొన్ని సినిమాల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ చిన్న పాత్రల్లో మెరిసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మెగాస్టార్- పవర్ స్టార్ మరోసారి కలిసి తెరపై అభిమానులకు కనువిందు చేయబోతున్నారు.
మెగాస్టార్ నటించబోతున్న 151వ మూవీ 'సై రా నరసింహా రెడ్డి' డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 152వ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట. ఈ చిత్రాన్ని సుబ్బిరామిరెడ్డి, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

పవన్ పాత్ర అరగంట పాటు...
గతంలో చిరంజీవి సినిమాల్లో పవన్ కొన్ని సెకన్లు, లేదా నిమిషాలు మాత్రమే అలా మెరిసారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఎక్కువసేపు పాతుకుపోతారని, దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో పవర్ స్టార్ కనిపిస్తారని తెలుస్తోంది.

పవన్ కోసం ప్రత్యేక పాత్ర రాసిన త్రివిక్రమ్
చిరంజీవి 152వ సినిమా కోసం ఇప్పటికే రఫ్ స్క్రిప్టు సిద్ధం చేసిన త్రివిక్రమ్... ఇందులో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఓ పాత్ర రాశారని, సినిమాకు ఆ పాత్ర చాలా అవసరం అని, అందుకే త్రివిక్రమ్ ఇలా డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు.

మెగాస్టార్‌తో మూవీ అంటే ఆ మాత్రం ఘనంగా ఉండాలి
మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే మామూలు విషయం కాదు. అందులోనూ తొలిసారి అంత పెద్ద స్టార్ తో చేసే అవకాశం. అందుకే ఈ సినిమాని త్రివిక్రమ్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాడని, అందులో పవన్ కళ్యాణ్ కు కూడా ప్రత్యేకంగా పాత్ర రాసి సినిమాను మరింత ఘనంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని టాక్.

అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది
అయితే చిరంజీవి 152వ సినిమా గురించి ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మెగాస్టార్, త్రివిక్రమ్ వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఈ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వారు ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

సైరా నరసింహా రెడ్డి
రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిరంజీవి 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి' డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. 2018 చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

పవన్-త్రివిక్రమ్ మూవీ
మరో వైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి'(వర్కింగ్ టైటిల్) సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications