వెంకటేష్ కి భార్య-మహేష్ బాబుకి వదిన అయిన ఖుషీ హీరోయిన్...!?
విక్టరీ వెంకటేష్, మహేష్ కలిసి నటించే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి సంబంధించిన ఓ ఇంపార్టెంట్ అప్ డేట్ ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రంలో వెంకటేష్ తో జోడీ కట్టే హీరోయిన్ ఎవరో దాదాపు కన్ ఫర్మ్ అయినట్టే. గత కొద్దిరోజులుగా వెంకీ భార్యగా ఎవరు నటిస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగింది. ఈ పాత్ర కోసం చాలామంది పేర్లే వినిపించాయి. అయితే వెంకీ భార్య క్యారెక్టర్ కు భూమిక అయితే కరెక్ట్ గా ఉంటుందని దర్శకనిర్మాతలు భావించారట. వెంకీ, భూమిక గతంలో 'వాసు" అనే చిత్రంలో కలిసి నటించారు. ఇందులో వీరి జంటకు మంచి మార్కులే పడ్డాయి. మరోసారి ఈ హిట్ పెయిర్ ని కలిపితే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు.
ఇక ఈ చిత్రంలో వెంకటేష్ కు సోదరుడిగా మహేష్ బాబు నటిస్తున్నాడు. అంటే మహేష్ కు వదిన పాత్రలో భూమిక నటిస్తోందన్నమాట. మహేష్ తో దూకుడు తర్వాత సమంతా మరోసారి జోడీ కడుతోంది. కొత్తబంగారు లోకం తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కు దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రానికి మిక్కీ.జే.మేయర్ సంగీతమందిస్తున్నాడు. ఈ గోల్డెన్ ఆఫర్ తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరేందుకు... మిక్కీ అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











