ఖుషిగా కాశీకి ప్రయాణమైన పవన్ కళ్యాణ్, ఇలియానా
కాశి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో షూటింగ్‌ను ప్రారంభించి పటియాల, అమృత్ సర్, పూణే, ఇటలీ, అమెరికా లాంటి ప్రదేశాలలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరిస్తాం. పవన్ కళ్యాణ్ చిత్రాల్లో నెంబరాఫ్ లొకేషన్స్ లో, భారీ ఖర్చుతో ఈ చిత్రం నిర్మాణమవుతుంది అంటున్నారు నిర్మాత గణేష్ బాబు. పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై గణేష్ బాబు తాను నిర్మిస్తున్న ఖుషీగా చిత్రం షూటింగ్ వివరాలను మీడియాకు అందచేసారు. అలాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గెటప్, పాత్ర సరికొత్తగా వుంటుందని, మణిశర్మ సంగీతం చిత్రానికి ప్లస్ అయ్యే విధంగా వుంటుందని, ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ అందిస్తున్న సంభాషణలు అందర్ని అలరిస్తాయని చెప్పారు.
జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం హిందీ చిత్రం 'లవ్ ఆజ్ కల్'కు రీమేక్ గా తయారవుతోంది. ఈ నెల నాలుగో వారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. దాదాపు సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రం పూర్తవుతుంది. ఇలియానాతో పాటు 'బోణి' ఫేం కృతి కర్భందా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. బడే రవికుమార్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి ఆర్ట్: నారాయణ రెడ్డి, సినిమాటోగ్రఫి: జైనన్ విన్సెంట్, కొ-ప్రొడ్యూసర్: శివబాబు.'జల్సా' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్, ఇలియానా కలిసి నటిస్తున్న చిత్రం కావటంతో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











