»   » పవన్‌‌కి తెలుసు, పట్టించుకోవద్దన్నారు: రేణు దేశాయ్

పవన్‌‌కి తెలుసు, పట్టించుకోవద్దన్నారు: రేణు దేశాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ అతనితో విడిపోయి గత కొంత కాలంగా పుణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తన ఇద్దరు పిల్లల పెంపకం బాధ్యతలు చూసుకుంటేనే మరో వైపు దర్శకురాలిగా, నిర్మాతగా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి మరాఠీలో ఓ సినిమాను నిర్మించిన రేణు, ఓ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా.

ఇటీవల ఆమె ఓ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భర్య పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మేము విడిపోయినప్పటికీ పిల్లల పెంపకంపై ఆ ప్రభావం లేకుండా తల్లిదండ్రులుగా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. పవన్, నేను ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్. దాదాపు ప్రతి రోజూ మాట్లాడుకుంటాం. మా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం ఆయనకు తెలుస్తుంది అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Pawan Kalyan knows those hate messages

ఈ మధ్య సోషల్ నెట్వర్కింగులో తనకు ఎదురవుతున్న హేట్ మెసేజ్ గురించి ఆయనకు తెలుసా? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ....‘ఆ మెసేజ్ ల గురించి ఆయనకు కూడా తెలుసు. అలాంటి వాటిని పట్టించుకోవద్దు, వాటి గురించి అనవసరంగా ఆలోచించొద్దు' అని సూచించినట్లు తెలిపారు.

హేట్స్ కామెంట్స్...
తన కూతురు ఆద్యా స్కూలులో డాన్స్ పెర్పార్మెన్స్ ఇవ్వడంపై రేణు దేశాయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ట్వీట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానకి హాజరైనట్లు పేర్కొన్నారు. అయితే ఇంగ్లీష్ అర్థం కాని కొందరు యాంటీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ టాక్ చేసారు. దీంతో రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు.

Pawan Kalyan knows those hate messages

నా చిన్నారి కూతురు స్కూలులో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కూతురు ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉంది. అదొక ఎమోషనల్ మూమెంట్. ఈ భావన తల్లిగా నా కంటే తండ్రికి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మాటల్లోచెప్ప లేనిది' అంటూ తొలుత రేణు దేశాయ్ ట్వీట్ చేసింది.

దీనికి ఓ వ్యక్తి కామెంట్ చేస్తూ....‘ఆమె డాడీ చాలా బ్యాడ్. ఫంక్షన్ కి హాజరు కాలేదు. మంచి డాడీ అంటే ఇలా ఉండాలి' అంటూ మహేష్ బాబు తన కొడుకు గౌతం స్కూలుకి వెళ్లిన ఫోటో పోస్టు చేసాడు.

అతడి కామెంటుతో ఆగ్రహానికి గురైన రేణు దేశాయ్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘ముందు నువ్వు స్కూలుకు వెళ్లి ఇంగ్లీషు సరిగా నేర్చుకో. నీ స్టుపిడ్ కామెంట్స్ చేసే ముందు పర్ ఫెక్టుగా ఇంగ్లీషు నేర్చుకో. నేను నా ట్విట్లో ఆద్యా డీడా కూడా అక్కడ ఉన్నట్లే చెప్పాను. నీకు సరిగా ఇంగ్లీష్ అర్థం కాకుంటే నేనేం చేయను?...ఇలాంటి చెత్త కామెంట్స్ చేసే ముందు ఇంగ్లీష్ నేర్చుకుని రండి' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

English summary
" We may be separated but this doesn’t stop us from being parents to our two kids. Pawan and I are still good friends and we talk almost every day. He knows everything about what is happening in my life’’said Renu Desai, talking about her ex-husband Replying to a question about hate messages she is getting Renu said "Yes, he knows about those hate messages.Pawan keeps on telling me to ignore such messages and not think too much about them" Renu Desai said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu