»   » పవన్ కళ్యాణ్ ‘కోబలి’...ఈ లుక్ ఎలా ఉంది?

పవన్ కళ్యాణ్ ‘కోబలి’...ఈ లుక్ ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా 'కోబలి' అనే చిత్రం రూపొందనుందంటూ ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులు పవన్ స్టార్‌ను 'కోబలి'గా ఊహించుకుంటున్నారు. తాజాగా కొందరు అభిమానులు తమ క్రియేటివిటీకి పదును పెట్టి పోస్టర్లు క్రియేట్ చేసి సోషల్ నెట్వర్కింగులోకి వదిలారు. ఇక్కడ చూస్తున్న పోస్టర్ అదే.

ఫిల్మ్ నగర్లో గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం ఏమంటే 'కోబలి' చిత్రానికి పవన్ ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా 'అత్తారింటికి దారేది' చిత్రం తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉంది.

'కోబలి' చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సొంత బేనర్ పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై నిర్మించనున్నారట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కేవలం హీరో, దర్శకుడు మధ్య ఉండే సాధారణ సంబంధమే కాదు, వీరి మధ్య ఒక మంచి ఆత్మీయమైన స్నేహబంధం ఉంది. ఇద్దరూ కలిసి త్వరలో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.

అత్తారింటికి దారేది సినిమా విషయానికొస్తే....ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా...రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో సినిమాను విడుదల ఆపివేసారు. పరిస్థితి చల్లబడితే అక్టోబర్ మొదటి వారంలో సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈచిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Trivikram will again direct Pawan Kalyan for a film titled Kobali. Kobali fan made poster halchal in internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu