గీతా ఆర్ట్స్ చేతికి 'కొమరం పులి' రైట్స్...రిలీజ్ డేట్ ఫైనల్ గా అదే ఫిక్స్
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'కొమరం పులి' చిత్రం ఆగస్టు 12న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆగస్టు 15 కలసి వచ్చేలా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ జల్సా కూడా ఇంతకుముందు ఇదే పంధాలో వెళ్ళి రిలీజ్ చేసారు. ఇక శింగనల రమేష్ ఈ చిత్రాన్ని మంచి మొత్తానికే గీతా ఆర్ట్స్ కి ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిఖిషా పటేల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం ఆడియోని సోనీ మ్యూజిక్ వారు తీసుకున్నారు. జూలై 11న సంగత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ ని పిలిచి ఆడియో పంక్షన్ ని ఘనంగా చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ రోజే నుంచే భారీగా ప్రచారం కూడా ప్రారంభం అవుతుంది.
పులి పవన్ కళ్యాణ్ నిఖిషా పటేల్ ఎస్ జె సూర్య ఖుషీ శింగనమల రమేష్ శ్రియ pawan kalyan puli nikisha patel sj surya kushi shriya


Click it and Unblock the Notifications