మొదటి వారం కలెక్షన్స్ తో పులి పిల్లి అయ్యింది..!
ఎన్నో భారీ అంచనాలతో వచ్చి, ఎంతో మంది అభిమానులు తన వెంట వున్నా సినిమాలో ఏ మాత్రం విషయం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ హీరోగా కనకరత్న మూవీస్ బ్యేనర్ లో వచ్చినటువంటి కొమరం పులి చతికిలపడిన విషయం అందరికి తెలిసిందే. తొలివారం తోనే సినిమాని మూసుకోవాల్సిన పరిస్తితి ఎదురుపడింది. ఇంతక ముందు ఎన్నడూ ఏ సినిమాకి లేని విధంగా ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో తొలి వారం వసూళ్లు కూడా పెద్దగా రాకపోగా, ఏదో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో కాస్త బయటపడి 15 కోట్ల 8 లక్షల 46వేల షేర్ ని సాధించిపెట్టింది. సోమవారం నుంచే బాగా తగ్గుముఖం పట్టిన కొమరం పులి కలేక్షన్లు అన్నిచోట్లా సగానికి పైగా తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుతం మార్కెట్ లో మరో పెద్ద సినిమా ఏదీ లేదు కనుక ఓ రెండు వారాలపాటు వసూళ్శు జోరుగా వుంటాయని ఆశించినా ప్రేక్షకులు మాత్రం పులి జోలికి వెళ్శడం లేదు. దీనితో చాలా చోట్ల తకిట తకిట వంటి చిన్న సినిమాలకు కలెక్షన్లు బాగా పెరిగాయని థియేటర్ యాజమాన్యం వెల్లడించారు. ఇదంతా పులి పుణ్యమే అని వారు అనుకుంటున్నారు. పులికి వచ్చిన వారు చాలా మంది టాక్ బాగా లేదనడంతో చిన్న చిన్న సినిమాలపై మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ వీకెండ్ లోనైనా పులి జూలు విదిలిస్తే తప్ప డిస్ట్రిబ్యూటర్స్ ఇక జీవితంలో కోలుకోలేరని ఫిలిమ్ సిటి వర్గాల సమాచారం. దానికి కారణం అక్టోబర్ మొదటి వారంలో రోబో మరియు జూ ఎన్టీఆర్ బృందావనం సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, కాబట్టి అప్పటికి పులి పాతదైపోతుంది, అంతేకాకుండా ఇక పులిని చూసే వాళ్శే ఉండరని వారి సినీవిశ్లేషకుల అభిప్రాయం.


Click it and Unblock the Notifications











