twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    PSPK27 లీక్.. గజదొంగగా పవన్ కళ్యాణ్ లుక్.. అదిరింది!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో రెడీ అవుతున్నప్పటికి కూడా అందరి ఫోకస్ - డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపైనే ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నుంచి ఈ సినిమాపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక పెరుగుతున్న బజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కొన్ని లొకేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో అయితే గట్టిగానే వైరల్ ఆయాయు. ఇక పవన్ లుక్ కు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది.

    17 శతాబ్దంలో జరిగే కథ

    17 శతాబ్దంలో జరిగే కథ

    దర్శకుడు క్రిష్ ఈ సినిమాలో కాలాన్ని 300 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లనున్నాడు. 17 శతాబ్దంలో వాతావరణాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. భాగ్యనగరాన్ని అలాగే గండికోట వంటి చారిత్రాత్మక కట్టడాలను కూడా చూపించబోతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోగా దర్శకుడు క్రిష్ సరికొత్త ప్లానింగ్ తో షెడ్యూల్స్ ని మళ్ళీ రెడీ చేసుకున్నాడు. సినిమాను 2022 సంక్రాంతి అనంతరం విడుదల చేయాలని అనుకుంటున్నారు గాని ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు.

    టైటిల్ ఫస్ట్ లుక్.. వచ్చేది ఆ రోజే

    టైటిల్ ఫస్ట్ లుక్.. వచ్చేది ఆ రోజే

    ఇక సినిమాకు మొట్టమొదట విరూపాక్ష అనే టైటిల్ ని సెట్ చేసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు దాన్ని కేవలం వర్కింగ్ టైటిల్ గానే అనుకున్నాడు. రీసెంట్ గా హరిహర వీరమల్లు, హరహర మహాదేవ అనే టైటిల్స్ పై కూడా కథనాలు వచ్చాయి. జానపద సినిమాలను తలపించేలా కథను సెట్ చేసుకున్న క్రిష్ ఇంకా ఆ టైటిల్ ని అయితే పూర్తిగా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఆ విషయంపై కూడా చర్చలు జరుపుతున్నారు. మార్చ్ 11న ఫస్ట్ లుక్ టైటిల్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.

    పహిల్వాన్ లతో పవన్ వీరోచిత పోరాటాలు

    పహిల్వాన్ లతో పవన్ వీరోచిత పోరాటాలు

    రీసెంట్ గా కొన్ని ఫైట్ సీన్స్ కోసం షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. బలమైన పహిల్వాన్ లతో పవన్ వీరోచిత పోరాటాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ సినిమాలో హైలెట్ గా ఉంటాయట. లొకేషన్స్ కు సంబంధించిన అనేక రకాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే యాక్షన్ సీన్స్ నెవర్ బిఫోర్ అనేలా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    పవన్ కళ్యాణ్ లుక్ వైరల్

    పవన్ కళ్యాణ్ లుక్ వైరల్

    ఇక గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక లుక్ అయితే వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఒక గజదొంగ పాత్రలో కనిపిస్తున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక పవర్ స్టార్ కాస్ట్యూమ్ కూడా 17వ శతాబ్దానికి తగ్గట్లుగానే ఉంది. పవన్ ఇలా మొదటిసారి కనిపిస్తుండడంతో ఒక్కసారిగా ఆ ఫొటో వైరల్ అయ్యింది.

    పక్కా ప్లాన్ తో వెళుతున్న క్రిష్

    పక్కా ప్లాన్ తో వెళుతున్న క్రిష్

    ఇక చిత్రం కోసం ప్రత్యేకంగా భారీ బడ్జెట్ తో చార్మినార్ సెట్ అలాగే గండికోటను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమా కథ 17వ శతాబ్ద కాలంలో నడుస్తుందట.. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రతి చిన్న విషయాన్ని పక్కా ప్లాన్ తో ఫాలో అవుతున్నారు. ఇక మొదట ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆలస్యం కావడం వలన సమ్మర్ కు షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నారు.

    English summary
    Pawan Kalyan’s upcoming film under Krish’s direction has been constantly making headlines for the last couple of months regarding its leading lady. After Pragya Jaiswal and Keerthy Suresh, Bollywood actress Jacqueline Fernandez was said to be roped in as the leading lady opposite the Powerstar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X