PSPK27 First Look Glimpse : ‘హరిహర వీరమల్లు’గా పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ అని మొదటగా ప్రకటించడంతో అందరికీ అంచనాలు మొదలయ్యాయి. క్రిష్ సినిమా అంటే అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. కంటెంట్, క్వాలిటీ, విలువలు ఇలా ప్రతీ ఒక్క విషయంలో ప్రేక్షకుడికి ఓ అంచనా ఉంటుంది. అలాంటి క్రిష్.. పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఎలా ఉంటుందా? ఉండబోతోంది? అంటూ ఫ్యాన్స్ రకరకాలుగా ఆలోచనలు మొదలుపెట్టేశారు. కానీ వాటికి తగ్గట్టే సినిమా ఉండబోతోందనే విషయం తెలుస్తోంది.

అలా రచ్చ మొదలు..

అలా రచ్చ మొదలు..

క్రిష్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ, కథా నేపథ్యం అన్నీ కూడా బయటకు వచ్చేశాయి. మొఘలుల కాలం నాటి సినిమా అని, చారిత్రక నేపథ్యం ఉన్న ఈ మూవీలో వజ్రాల దొంగగా పవన్ కళ్యాణ్ నటించబోతోన్నట్టు లీకులు వచ్చేశాయి. వాటికి తగ్గట్టు ఓ ప్రీ లుక్ కూడా వచ్చేసింది.

లాక్డౌన్ వల్ల..

లాక్డౌన్ వల్ల..

గతేడాది ఫిబ్రవరి ఓ వారం రోజులు మాత్రమే షూటింగ్ జరిగింది. ఆ తరువాత కరోనా, లాక్డౌన్ వంటివి రావడంతో సినిమా మొత్తంగా వాయిదా పడింది. మళ్లీ ఏడాది తరువాత ఈ మధ్యే మూవీ షూటింగ్ మొదలైంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి మహా శివరాత్రి సందర్భంగా అప్డేట్ ఇచ్చేశారు.

అలా లీక్..

అలా లీక్..

అయితే ఈ మూవీ నుంచి ఇంత వరకు అప్డేట్ రాలేదని, కనీసం టైటిల్, ఫస్ట్ లుక్ వంటివి కూడా ఇవ్వలేదని ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. అయితే ఈలోపే పవన్ కళ్యాణ్ ఫోటోలు కొన్ని లీకయ్యాయి. వజ్రాల దొంగగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించబోతోన్నాడో అందరికీ ఓ అంచనా వచ్చేసింది.

చార్మినార్ సెట్..

అంతే కాకుండా ఈ మూవీ కోసం చార్మినార్ సెట్ కూడా వేశారని, దాదాపు మూడు శతాబ్దాల క్రితం నాటి పరిస్థితులను మళ్లీ తెరపై చూపించాలని క్రిష్ ప్రయత్నిస్తోన్నట్టు తెలుస్తోంది. అందుకే చార్మినార్ సెట్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా వదిలిన అప్డేట్‌తో అభిమానులు గాల్లో తేలిపోతోన్నారు.

హరిహర వీరమల్లు..

హరిహర వీరమల్లు..

అందరూ అనుకున్నట్టుగా సినిమా టైటిల్ ఉంది. హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ అదరగొట్టేశాడు. తాజాగా చిత్రయూనిట్ వదిలిన స్టిల్ నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X