పవన్ కళ్యాణ్ ఖుషి ‘ఖుషిగా’ కి రిపేర్లు
పవన్ కళ్యాణ్ కెరీర్ లో హిట్టయిన సినిమాల్లో ఒకటి రెండు మినహాయిస్తే మిగతావన్నీ రీమేకులే. అందుకే పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా రీమేక్ చేస్తున్నాడనగానే అభిమానులు ఒక హిట్ రాబోతోందని భరోసాతో వుంటారు. 'కొమరం పులి" తర్వాత 'లవ్ ఆజ్ కల్" రీమేక్ చేస్తున్నట్టు ప్రకటన రాగానే ఫ్యాన్స్ లో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. అయితే ఇతర భాషాచిత్రాలే కాక దేశ, విదేశీ చిత్రాలను కూడా వీక్షిస్తోన్న నేటితరం ప్రేక్షకులని రీమేక్ తో అలరించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ మద్య కాలంలో రీమేక్స్ బాగా తగ్గిపోవడానికి కూడా కారణమిదే. ఫలానా సినిమా రీమేక్ చేస్తున్నారని చెప్పగానే అంతవరకు అది చూడని వాళ్లు కూడా వెంటనే డివిడి తెచ్చుకునో, ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునో చూసేయడమే కాకుండా అదెంతవరకు వర్కవుట్ అవుతుందో కూడా ఒక అంచనాకి వచ్చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 'లవ్ ఆజ్ కల్" లాంటి పాపులర్ సినిమాని రీమేక్ చేస్తోన్న పవన్ కళ్యాణ్ కాషియస్ గానే వ్యవహరిస్తున్నాడు. 'లవ్ ఆజ్ కల్" థీమ్ ని మాత్రం తీసుకుని తెలుగుకి అనుగుణంగా గణనీయమైన మార్పులు చేస్తున్నారు. త్రివిక్రమ్ పర్యవేక్షణలో ఈ మార్పుచేర్పులు జరుగుతున్నాయి. పవన్ నటించిన సూపర్ హిట్ రీమేకులైన 'తమ్ముడు",'ఖుషీ"లకి కూడా మార్పులు బాగానే చేశారు. 'అన్నవరం" సినిమాకి కూడా అలా ట్రై చేసి, తర్వాత ఆ ఐడియా మార్చుకుని యాజిటీజ్ గా దించేశారు. దాని ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 'ఖుషీగా" సినిమాకి జాగ్రత్తలు అధికంగా తీసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి రీమేక్ లకి సొంత తెలివి జత చేయకపోతేనే మంచిదని కూడా అంటుంటారు. మరి 'ఖుషీ"గా ఇంకో 'ఖుషీ"నే అవుతుందో లేక 'అన్నవరం"లా అటు, ఇటు కాకుండా మిగుల్తుందో కాలమే చెప్పాలి.


Click it and Unblock the Notifications











