జానీ నుంచి గబ్బర్ సింగ్ వరకు.. 12 ఏళ్ళు ఎదురుచూశా, పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు!
పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ చివరగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలకు కేటాయించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖ పర్యటనలో బిజీగా గడుపుతున్నాడు.
అభిమానులు, పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులంతా సీఎం సీఎం అని నినాదాలు చేస్తుండగా.. తాను సినిమాల్లో ఒక్క హిట్టు కోసం 12 ఏళ్ళు ఎదురుచూశానని అన్నారు. జానీ చిత్రం నుంచి పరాజయం తరువాత గబ్బర్ సింగ్ చిత్రం వచ్చేసరికి దశాబ్దంపైగా గడిచిందని తెలిపారు.

రాజకీయాల్లోకి అంతకుమించి సహనంతో వచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఖుషి చిత్రంతో టాలీవుడ్ పవన్ క్రేజీ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత దాదాపు దశాబ్దకాలం పవన్ కు హిట్ లేదు. గబ్బర్ సింగ్ చిత్రంతో పవన్ మళ్ళీ పుంజుకున్నాడు.


Click it and Unblock the Notifications











