పవన్ కళ్యాణ్ 'లవ్ లీ' చిత్రం విడుదల తేది ఎప్పుడంటే...
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "పవన్ కళ్యాణ్ లవ్ లీ" మార్చి 28, 2011న విడుదలకు ప్లాన్ చేస్తునట్లు సమాచారం. ఈ చిత్రాన్ని జయంత్ సి.పర్జానీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మిస్తున్నారు. 'లవ్ ఆజ్ కల్' రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్...సౌత్ ఆఫ్రికా, కాశీలో కంటిన్యూ షెడ్యూల్ తో పూర్తి చేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గత హిట్ చిత్రం బద్రి షూటింగ్ అక్కడే జరిగింది. పిబ్రవరితో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలెడతారు. లవ్, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్...ఇలా అన్ని కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాతలు చెప్తున్నారు. అలాగే త్రిష, కృతి కర్బందా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. రచయిత మరియు దర్శకుడు అయిన త్రివిక్రమ్ ఈ చిత్రానికి పూర్తి స్క్రిప్ట్‌ని అందించారు. పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఖుషిని ప్లేవర్ లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రంలో పవన్ రెండు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బడే రవికిరణ్, ఛాయాగ్రహణం: జైనన్ విన్సెంట్, సంగీతం: మణిశర్మ.


Click it and Unblock the Notifications











