ఫ్యాన్స్ హడావుడి: జిమ్ వద్ద పవన్ కళ్యాణ్ ఇలా.. (వీడియో)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ భారీగా గెడ్డం పెంచేసి ‘గబ్బర్ సింగ్-2' చిత్రానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా పాత్రకు తగిన విధంగా ఆయన తన బాడీని కూడా మెయింటేన్ చేస్తున్నారు. బెంగుళూరులోని ఓ జిమ్ లో ఆయన ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ వెలుతున్న ఆ జిమ్ అడ్రస్ తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ జిమ్ నుండి బయటకు ఎప్పుడోస్తారా? ఆయన్ను ఎప్పుడూ చూద్దామా? అనే ఆసక్తి వారిలో కనిపించింది. పవన్ కళ్యాణ్ బయటకు రాగానే పవర్ స్టార్ ని పొగుడుతూ నినాదాలు చేస్తూ హడావుడి చేసారు. అప్పటికే జిమ్ చేసి అలసి పోయి ఉన్న పవన్ కళ్యాణ్ వేగంగా అక్కడి నుండి వెళ్లి పోయారు.
గబ్బర్ సింగ్-2 సినిమా విశేషాల్లోకి వెళితే..‘గబ్బర్ సింగ్-2' చిత్రం షూటింగ్ మే 29 మహారాష్ట్రలోని మల్షెజ్ ఘాట్స్ ప్రాంతంలో ప్రారంభించారు. జూన్ 5తో తొలి షెడ్యూల్ పూర్తయింది కూడా. అయితే షూటింగులో ఇంకా పవన్ కళ్యాణ్ జాయిన్ కాలేదు. రెండో షెడ్యూల్ ను జూలై మొదటి వారంలో ఆరంభిస్తారని, ఆ షూటింగులో పవన్ కళ్యాన్ జాయిన్ అవుతారని తెలుస్తోంది.
గబ్బర్ సింగ్ 2 ఫ్లాస్ బ్యాక్ ఎపిసోడ్లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

అప్పట్లో 'గబ్బర్ సింగ్' సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో చిత్రీకరించారు. ఇప్పుడు 'గబ్బర్ సింగ్ -2' షూటింగ్ కూడా కొంత అక్కడే చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈవిషయమై ఇంకా అఫీషియల్ సమాచారం లేదు.


Click it and Unblock the Notifications











