హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ కళ్లలో నీళ్లు! (ఫోటోలు)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం జరిగిన 'బసంతి' ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రవర్తన పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వేడుకలో పవన్ తనివితీరా నవ్వారు. పగలబడి నవ్వారు. ఎంతగా అంటే....కళ్లలో నీళ్లు వచ్చేంతగా!
బ్రహ్మానందం ఆహ్వానం మేరకు బసంతి ఆడియో వేడుకకు హాజరైన ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు, తెలుగువాడైన జానీ లీవర్ ఈ వేడుకలో చేసిన కామెడీకి పవన్ కళ్యాణ్ నవ్వు ఆపుకోలేక పోయారు. జానీ కామెడీని గుర్తు చేసుకుని ఈ కార్యక్రమం నుండి వెళ్లి పోయే వరకు ఆయన నవ్వుతూనే ఉన్నారు. స్పీచ్ ఇచ్చే సమయంలో కూడా పవన్‌కు నవ్వు ఆగలేదు. పవన్ అలా మళ్లీ మళ్లీ పగలబడి పగలబడి నవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
చాలా రోజుల తర్వాత పవన్ ఇంత హ్యాపీగా ఉండటం, నవ్వుకోవడం చూసిన అభిమానులు, ప్రేక్షకులు హ్యాపీగా ఫీలయ్యారు. అందుకు సంబంధించిన ఫోటలు స్లైడ్ షోలో.....

బసంతి
రాజా గౌతమ్, అలీషాబేగ్ హీరో హీరోయిన్లుగా స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై చైతన్య దంతులూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘బసంతి'. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేసారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

రాజా గౌతంకు పవన్ విషెస్
'బసంతి' సినిమా పాటల విడుదల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గౌతమ్ మంచి అభిరుచి ఉన్న హీరో అని, బసంతి సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.

పవన్ మాట్లాడుతూ...
''బాణం' సినిమా చూశాను. చైతన్య దంతులూరి చాలా బాగా తీశాడు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా కూడా చక్కటి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. గౌతమ్ అభిరుచి ఉన్న నటుడు. అతడికి అందరి దీవెనలు లభించాలి'' అన్నారు .

ఆడియో ఆవిష్కరణ
ఆవిష్కరణ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తొలి సీడీని ఆవిష్కరించి త్రివిక్రమ్‌కి అందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్,పవన్ కళ్యాణ్ ప్రక్క ప్రక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ పంక్షన్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారారు.

జానీ లీవర్
''బ్రహ్మానందంగారు అంటే నాకు చాలా గౌరవం. నేను హైదరాబాద్ ఎప్పుడొచ్చినా అతణ్ని కలుస్తాను. వినోదం పంచడంలో ఆయన ముందంజలో ఉంటారు. అన్ని రకాల హావభావాలు ఎలా వస్తాయా అని ఆలోచిస్తుంటాను. గౌతమ్‌కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని ఆశిస్తున్నాను'' అన్నారు.

బ్రహ్మానందం
బ్రహ్మానందం మాట్లాడుతూ.... ''నేను అడిగిన వెంటనే చిరంజీవి, మహేష్‌బాబు, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి, ప్రభాస్... ఇలా చాలా మంది సినిమా గురించి మాట్లాడారు. పాటల విడుదల కార్యక్రమాలకు ఎక్కువగా హాజరు కాని పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరికీ శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా' అన్నారు.


Click it and Unblock the Notifications











