twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్‌తో ‘దేవరాయ’ ఆడియో రిలీజ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శ్రీకాంత్, విదీష, మీనాక్షి దీక్షిత్ కాంబినేషన్లో నాని కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దేవరాయ'. నానిగాడి సినిమా సమర్పణలో సన్ రే ఇంటర్నేషనల్ పతాకంపై కిరణ్ జక్కం శెట్టి, నాని కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఈ నెల 12న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పాటలను ఆవిష్కరించనున్నారు.

    ఈ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ...'పవన్ కళ్యాణ్ మా ఫంక్షన్‌కు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ కెరీర్లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. శ్రీకృష్ణ దేవరాయలు, దొరబాబుగా ఆయన రెండు పాత్రల్లో కనిపిస్తారు. రాయలవారి గెటప్‌లో ఆయన చాలా హుందాగా ఉన్నారు. షూటింగ్‌తో పాటు రీ రికార్డింగ్ తదితర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం డీటీఎస్ వర్క్ కు సిద్ధం అవుతున్నాం. చక్రి సంగీతం ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల ద్వితీర్థంలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు.

    100 సినిమాల హీరో శ్రీకాంత్‌ శ్రీకృష్ణదేవరాయలుగానూ, విలేజ్‌లో దొరబాబుగానూ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'దేవరాయ'. ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ 'నాని నాకు మూడు కథలు చెప్పారు. అందులో ఈ కథ నచ్చి నాకూ ప్లస్‌ అవుతుందని అంగీకరించాను. చెప్పినట్లు బాగానే తీశాడు. ఇందులో దేవరాయగా, దొరబాబుగా రెండు పాత్రలు పోషించాను. ఒకరకంగా చెప్పాలంటే ఇష్టపడి, ఒల్లు దగ్గర పెట్టుకుని పనిచేశాను. వీరబాబు రాసిన డైలాగ్స్‌, పూర్ణ కెమెరా పనితనం ఆకర్షణీయంగా ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌కాకుండా ఈ చిత్రముంటుంది' అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పూర్ణ కాండ్రు, ఆర్ట్: జేకే మూర్తి, మాటలు: వీరబాబు బాసిన, ప్రొడక్షన్ కంట్రోలర్: బందరు బాబి.

    English summary
    Power Star Pawan Kalyan will be launching the audio of family hero Srikanth’s ‘Devaraya’. The movie’s audio launch will take place on September 12th in Shilpa Kala Vedika and arrangements are being made in a big way for Pawan Kalyan’s presence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X