వాళ్ల నాన్న నాకు గురువు... రెగ్యులర్ హీరోగా రాలేదు: పవన్ కళ్యాణ్

By Bojja Kumar

ఆ న‌లుగురు, మ‌ధు మాసం, అంద‌రి బంధువ‌య‌తో ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను స్పృశించిన సెన్సిటివ్‌ ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ నుండి వస్తున్న మరో చిత్రం 'ఆటగదరా శివ'. ఉద‌య్ శంక‌ర్ క‌థానాయ‌కుడు. ప‌వ‌ర్‌, లింగా, బ‌జ‌రంగీ భాయీజాన్‌ చిత్రాలను నిర్మించిన రాక్‌లైన్ వెంకటేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని 'ఎట్టాగయ్యా శివ' అనే పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఆఫీసులో విడుదల చేశారు.

వాళ్ల నాన్న నాకు గురువు... రెగ్యులర్ హీరోగా రాలేదు

వాళ్ల నాన్న నాకు గురువు... రెగ్యులర్ హీరోగా రాలేదు

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ బావున్నాయి. వాసుకి శివ తత్వం మీద రాసిన పాట బాగా నచ్చింది. గోకుళంలో సీత తగ్గర నుండి నుండి ఉదయ్ శంకర్ నాకు తెలుసు. వాళ్ల నాన్నగారు శ్రీరామ్ నా గురువు. మాకు ఆయన ఇంగ్లీష్ లెక్చరర్. స్పిరుచువల్ గురువు కూడా. చంద్ర సిద్ధార్థ్ సినిమాలు ‘ఆ నలుగురు' లాంటి సినిమాలు చాలా యూనిక్ గా ఉంటాయి. ‘ఆటగదరా శివ' కూడా ఒక డిఫరెంట్ సినిమా అనిపించింది. ఉదయ్ శంకర్ పాత్ర కూడా కొత్తగా ఉంది. రెగ్యులర్ హీరోగా కాకుండా నటుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే విధానం నచ్చింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.... అన్నారు.

ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకున్న ఖైదీ కథ

ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకున్న ఖైదీ కథ

హీరో ఉద‌య్‌శంక‌ర్ మాట్లాడుతూ ``ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకుని ఓ ఖైదీ బ‌య‌ట‌ప‌డ‌తాడు. అనుకోకుండా త‌న‌ను ఉరితీయాల్సిన తలారినే క‌లుస్తాడు. వాళ్లెవ‌ర‌న్న విష‌యం ప‌ర‌స్ప‌రం తెలియ‌క‌పోవ‌డంతో క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. ఆ ప్ర‌యాణంలో వాళ్ల‌కు ఎదుర‌య్యే అనుభ‌వాలు ఏంటి? వాళ్లు ఎవ‌రెవ‌రిని క‌లిశారు? అనేది మా సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన అంశమని హీరో తెలిపారు.

జులై 20న విడుదల

జులై 20న విడుదల

క‌థానాయ‌కుడిగా నా తొలి చిత్ర‌మిది. చిన్న‌ప్ప‌టి నుంచి పుస్త‌కాలు బాగా చ‌దివేవాడిని. నా ఊహ‌ల‌కి త‌గ్గ క‌థ ఇది. ఈ క‌థ‌తో ప‌రిచ‌య‌మ‌య్యే అవ‌కాశం ల‌భించినందుకు ఆనందంగా ఉంది. న‌చ్చిన క‌థ దొర‌క‌డంతో పాత్ర కోసం ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా. ఖైదీగా క‌నిపించాలని 11 నెల‌ల పాటు గ‌డ్డం, మీసాలు పెంచా. ద‌ర్శ‌కుడు చేసిన స‌పోర్ట్ ని మ‌ర్చిపోలేను. నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్‌గారు నన్ను హీరోని చేస్తాన‌ని మాటిచ్చారు. ఆ మాట ప్ర‌కారం ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. దొడ్డ‌న్న క‌న్న‌డ‌లో అగ్ర‌న‌టుడు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో క‌థానాయ‌కుడిగా నాకు చాలా మంచి పేరు వ‌స్తుంది. భావోద్వేగాల‌ను పండించ‌డంలో చంద్ర‌సిద్ధార్థ్ శైలి వేరు. ఆయ‌న తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగులో ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంది. జులై 20న సినిమా విడుదల చేస్తున్నాం`` అని చెప్పారు.

ఆటగదరా శివ

ఆటగదరా శివ

నటులు : ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది, దీప్తి, చలాకీ చంటి, భద్రం, చమ్మక్ చంద్ర, సందేశ్, జ్వాలా కోటి, సాహితీ, రమాదేవి తదితరులు.
కథ : డి సత్యప్రకాశ్
కెమెరా : లవిత్
సంగీతం : వాసుకి వైభవ్
మాటలు : ముని సురేష్ పిళ్లే, భీం శ్రీనివాస్
పాటలు : చైతన్య ప్రసాద్, పులగం చిన్నారాయణ
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X