పవన్ కళ్యాణ్ కాశీ లో ఈ రోజు నుంచి...

By Srikanya

హైదరాబాద్ : షార్ట్ బ్రేక్ తర్వాత మళ్లీ 'గోపాల గోపాల' షూటింగ్ కాశీలో ఈ రోజు నుంచే మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ మీద ఓ పాటను అక్కడ లొకేషన్స్ లో చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ ఐదు రోలుజు పాటు ఉంటుంది. కొద్ది రోజుల క్రితం వెంకటేష్ పై వైజాగ్ లో మరో పాట చిత్రీకరించారు. ఆ పాట చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం...వారణాశిలో పది నుంచి పన్నెండు రోజుల వరకూ షూట్ ఉంటుంది. సంక్రాంతి విడుదల కోసం శరవేగంగా షూటింగ్ ని జరుపుతున్నారు.

హిందీలో విజయవంతమైన ‘ ఓ మైగాడ్‌ ' చిత్రాన్ని పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, విక్టరీ వెంకటేష్‌ మల్టీస్టారర్‌గా తెలుగులో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ గోపాల గోపాల '. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. పవన్‌ అభిమానులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోస్టర్‌ రానే వచ్చింది.

Pawan Kalyan leaves to Varanasi

ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ మోడ్రన్‌ కృష్ణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఊయలలో ఊగుతున్న కృష్ణుడిలా ఉన్న పవన్‌ను వెంకటేష్‌ అనుకరించడం ఈ పోస్టర్‌లోని విశేషం. కిషోర్‌ పార్థసాని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి అనుప్‌రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరారీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధుశాలిని, దీక్షాపంత్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉండటంతో చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందరి ఊహగానాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉంటుందని ఫిలింనగర్‌లో టాక్‌ వినబడుతోంది. కిషోర్‌ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి డి.సురేష్‌బాబు, శరత్‌ మారార్‌లు కలిసి నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X