»   » హిట్-ప్లాపులు సహజం: పవన్ రిలాక్స్, వారం తర్వాత సిటీకి!

హిట్-ప్లాపులు సహజం: పవన్ రిలాక్స్, వారం తర్వాత సిటీకి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్డ్ష్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.... సినిమా యావరేజ్ టాక్ తో క్రమంక్రమంగా డీలా పడిపోయింది. భారీ ధరకు సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడి రికవరీ అవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది.

Also See: పవన్ కళ్యాణ్ రెండో కూతురు ఇదిగో, పేరు 'పోలెనా' (ఫోటోస్)


అయితే సినిమా పరిశ్రమలో హిట్-ప్లాపులు సహజమే....పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేయడానికి కారణం మినిమమ్ గ్యారంటీ ఉంటుందనే నమ్మకమే. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో ముందు అంచనలు భారీగా ఉండేవి. అంచనాలను సినిమా అందుకోలేదు. అయితే పెట్టుబడి ఏ మేరకు రికవరీ అవుతుందనేది తేలాల్సి ఉంది. అయితే ఈ సినిమా నిర్మాతల్లో పవన్ కళ్యాణ్ కూడా ఉండటంతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.


Also Read: పవన్ కళ్యాణ్ తీరుపై కొడుకు అకీరా ఆగ్రహం! ఎందుకు?


Pawan Kalyan left for Pune last week

ఆ సంగతి పక్కన పెడితే.... సినిమా విడుదల సందర్భంగా వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అవి ముగిసిన వెంటనే పుణె వెళ్లారు. అక్కడ తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యాలతో తన విలువైన సమయాన్ని గడుపుతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కారణంగా కొన్ని నెలల నుండి పవన్ కళ్యాణ్ వారికి దూరంగా ఉంటున్నారు. ఇపుడు సమయం చిక్కడంతో పుణె వెళ్లారు. వచ్చే వారం తిరిగి హైదరాబాద్ వస్తారు. పవన్ కళ్యాణ్-ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ సంతానమైన అకీరా, ఆధ్యా ప్రస్తుతం తల్లి వద్ద పూణెలో ఉంటున్నసంగతి తెలిసిందే.


Also Read: బర్త్‌డే స్పెషల్: అచ్చుగుద్దినట్లు పవన్ కళ్యాణ్ పోలికే! (ఫోటోస్)


పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చిన వెంటనే తన తర్వాతి సినిమాపై దృష్టిసారించనున్నారు. దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కే ఈచిత్రం గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఖుషి' చిత్రానికి సీక్వెల్ లా ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

English summary
According to close sources to Pawan, he left for Pune last week and is spending time with his kids in Pune. The source adds that Pawan will return to the city in the next week to look into further activities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu