నాగబాబు కొడుకు బాధ్యత భుజానేసుకున్న పవన్

By Bojja Kumar

పవన్ కళ్యాణ్ తన కుటుంబం విషయంలో చాలా బాధ్యతగా ఉంటాడనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి, నాగబాబుల మాటంటే ఆయనకు వేదం. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు పవర్ స్టార్. అన్నయ్యల మాట కాదనలేక తనకు అస్సలు పడని రాజకీయాల్లోనూ అడుగుపెట్టి 2009 ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాడు. కుటుంబానికి చెందిన ఏబాధ్యతైన తన బాధ్యతగా ఫీలయి కష్టపడటం పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచీ అలవాటే. పవన్ మనస్తత్వం కూడా అలాంటిదే అంటుంటారు ఆయన్ను చాలా దగ్గర నుంచి గమనించిన వారు.

తాజాగా మరో బాధ్యతను భుజానేసుకున్నాడు పవన్ కళ్యాణ్. నాగాబాబు తన తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే అందుకు సరైన కథలు చిక్కడం లేదు. దీంతో వరుణ్ తేజ్‌ కోసం మంచి కథను వెతికే బాధ్యతను తీసుకున్నాడు. పవన్‌కి ఏ మాత్రం కాస్త తీరిక దొరికినా, వరుణ్ తేజ్‌‍కి తగిన కథలు వింటున్నాడనీ, ఏ దర్శకుడి ద్వారా వరుణ్ తేజ్‌ని తెరకి పరిచయం చేయాలనే విషయమై కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు.

వాస్తవానికి 2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా...మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో తన తనయుడికి కూడా సెంటిమెంటు పని చేస్తుందని నాగాబాబు ఆశ పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X