టికెట్ రేట్ల పెంపుపై పవన్ కల్యాణ్ లాజిక్ కరెక్టే.. మరి ఆ ఆడియెన్స్ పరిస్థితి ఏమిటి?
గత కొన్నాళ్ల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న టికెట్ ధరల కంటే అదనంగా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు మొదలై ఇప్పటికీ ఇదే ట్రెండ్ కొనసాగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా దీనికి మధ్యలో మెయిన్ గా ఏపీలో జరిగిన పలు మార్పులు టాలీవుడ్ కి భారీ దెబ్బ వేసాయి. దీనితో కొన్నేళ్ల కితం తెలంగాణాలో పరిస్థితి ఒకలా ఉంటే ఏపీలో పరిస్థితి ఒకటిగా మారింది.
కాగా ఇక్కడ నుంచే మళ్ళీ అధికారం మారి స్వయంగా టాలీవుడ్ నుంచే స్టార్ హీరో ఏపీలో అధికారంలోకి రావడంతో సినిమాలకి మళ్ళీ కావాల్సినంత హైక్స్ వచ్చాయి. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ అదనపు టికెట్ ధరలు అనేది ఎంత వరకు ఆ సినిమాలకి ఉపయోగపడుతున్నాయి? ఆ హైక్స్ కేవలం అభిమానులు చూసే ఆ కొన్ని రోజులు మాత్రమే లేక మిడిల్ క్లాస్ ఆడియెన్స్ కి కూడా అందుబాటులో ఉండేలా కూడా ఉండాలా ఇలా చాలానే అంశాలు పరిగణలోకి వచ్చాయి.

కాగా ఇపుడు ప్రపంచ సినిమాలో పెరుగుతున్న పోటీ ఖచ్చితంగా అందులో ఇమడాలి అంటే మంచి క్వాలిటీతో కూడిన కంటెంట్ కావాలి ఆ కంటెంట్, క్వాలిటీ ఉండాలి అంటే డెఫినెట్ గా ఖర్చు చేయాల్సిందే. అందుకే ఈ టికెట్ ధరల హైక్స్ కావాలని నిర్మాతలు కోరుతున్నారు. అయితే పవన్ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొనే తెలుగు సినిమా కోసం అడిగినంత మొత్తం హైక్స్ ని ఇస్తున్నారు.
మొన్న పుష్ప 2 లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ ఒక్కటే కాకుండా డాకు మహారాజ్ సహా సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలకి కూడా హైక్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ హైక్స్ విషయంలో పవన్ చెప్పిన బడ్జెట్ అండ్ క్వాలిటీ పాయింట్స్ బాగానే ఉన్నాయి కానీ వీరిపై పలు విమర్శలు కూడా లేకపోలేవు. సినిమా అంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్.
మొదటి మూడు రోజులు మహా అయితే సినిమా వారం మధ్యలో రిలీజ్ అయితే ఆ వీకెండ్ వరకు 5 రోజులు అభిమానులే సినిమాకి బాగుంటే రెండు మూడు సార్లు వెళ్లొచ్చు కానీ ఒక సినిమా ఫలితం డిసైడ్ చేసేది మాత్రం రిపీట్ ఆడియెన్స్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ కానీ ఈ అదనపు రేట్లు వారిని థియేటర్స్ కి రాకుండా చేస్తున్నాయి అంటూ పలు కామెంట్స్ ఇపుడు వినిపిస్తున్నాయి.
పండుగల సమయంలో ఓకే కానీ నార్మల్ రోజుల్లో కూడా పదేసి రోజులు వారం రోజుల పాటు అధిక ధరలు పెట్టడంతో సామాన్య ప్రజలు సినిమాకి దూరం అవుతున్నట్టే అని కొన్ని కామెంట్స్ ఇపుడు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. దీనితో టికెట్ ధరలు పెంచుకోండి పర్లేదు కానీ మరీ మధ్య తరగతి ఆడియెన్స్ కి భారం కాకుండా ఉండేలా కేవలం కొన్ని రోజులు ఇచ్చి సాధారణ రోజుల్లో తగ్గించుకొని ఉంటే సరిపోతుంది అని కొందరు అంటున్నారు.
సో టాలీవుడ్ కోసం పవన్ ఆలోచన బాగానే ఉంది కానీ అందులో కొన్ని సరి చెయ్యాలని సోషల్ మీడియాలో న్యూట్రల్ ఆడియెన్స్ కూడా అంటున్నారు. మరి నిర్మాతలు వీటిని కూడా పవన్ లేదా ప్రభుత్వాల వరకు తీసుకెళ్తారో లేదా అనేవి కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











