'కెమెరామేన్ గంగతో...'లో పవన్ గెటప్ ఫోటో

By Srikanya

పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం షూటింగ్ మొన్న శుక్రవారం నుంచి మొదలైంది. పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గెటప్ ఇదే. ఇందులో పవన్ గెటప్ కొద్దిగా రఫ్ గా ఓ సాదాసీదా వ్యక్తిగా ఉండనుంది.

అమీర్ పేట సారధీ స్టూడియోలో భారి సెట్ వేసి షూట్ చేస్తున్నారు. సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు.

నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్టును దర్శకుడు పూరి జగన్నాథ్‌ పవన్‌ కళ్యాణ్‌కు వినిపించాడు. కథ మొత్తం వినగానే పవన్‌ ఎంతగానో ఉద్వేగానికి లోనయ్యాడట. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్‌ కామెంట్‌ చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్‌కు అసలు నిద్ర పట్టడం లేదట.

అలాగే 'గబ్బర్‌ సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఇదంతా వీడియోగా తీసి పూరీ..యూ ట్యూబ్ లో పెట్టాడు. అలాగే ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో అప్ డేట్స్ ఇస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా నటించే ఈ చిత్రం వచ్చే అక్టోబర్‌ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్‌ ప్లాన్‌ చేశాడు.

ఇక ఈ చిత్రంకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు

బ్యానర్: యూనివర్సల్ మీడియా
నటీనటులు: పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X