పంజా గెటప్ నుండి కొత్త స్టైల్ మార్చిన పవన్ కళ్యాణ్...!
'పంజా" సినిమాకి గెటప్ మార్చి గడ్డంతో చాలా రఫ్ గా, కమర్షియల్లో మాస్ గా కనిపించిన పవన్ కళ్యాన్ ఇప్పడు మళ్లీ మునుపటిలా గడ్డం లేకుండా తిరుగుతున్నాడు. పంజాలో పవన్ గెటప్ తెగ నచ్చేసిందని కొందరు అంటున్నా కానీ అతని గ్లామర్ కి మరీ అంత రఫ్ లుక్ కరెక్ట్ కాదని అంటున్న అభిమానులూ ఉన్నారు. తదుపరి చిత్రం 'గబ్బర్ సింగ్"లో పవన్ గుబురు గడ్డంతో, కమర్షియల్ మాస్ లుక్ తో కాకుండా క్లీన్ షేవ్ తో లవర్ బాయ్ గా కనిపించనున్నాడు.
నలభైయ్యేళ్లు దాటినా కానీ ఇప్పటికీ గ్లామర్ సూపర్ గా మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్"లో కొత్త కొత్త స్టయిల్స్ తో ముందుకు రానున్నాడు. పవన్ కి వీరాభిమాని అయిన హరీష్ శంకర్ అతడిని సరికొత్తగా చూపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. దబాంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ స్టయిల్ అస్సలు అనుకరించకుండా పవన్ ఇందులో పూర్తిగా తన స్టయిల్ మాత్రమే చూసించనున్నాడు. చివరకు కళ్లజోడు తగిలించుకునే స్టయిల్ తో సహా...!


Click it and Unblock the Notifications











