'పులి' రిలీజ్ కి పవన్ 5 కోట్లు వదులుకున్నాడా...!?
'కొమరం పులి" 10న విడుదలవుతుందని నమ్మకంగా తెలిశాక కూడా బుధవారం నాడు హైడ్రామా నడిచించి. 'పులి" రిలీజ్ ఆగిపోయే పరిస్థితి తలెత్తింది శింగనమల రమేష్ కి ఉన్న పాత అప్పులు 'పులి" మెడకి చుట్టుకుని చివరి నిముషంలో అందరినీ టెన్షన్ పెట్టాయి. అల్లు అరవింద్ రంగంలోకి దిగి తనవంతుగా కొంత భారాన్ని మోయగా, తనకు రావాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ సంగతి తర్వాత చూసుకుందామని, ఎట్టి పరిస్థితుల్లోను సినిమా రిలీజ్ ఆగకుండా చూడండని పవన్ కళ్యాణ్ దాదాపు అయిదు కోట్ల రూపాయలు వదిలేసుకోగా 'కొమరం పులి" విడుదలపై కమ్మిన అనుమానపు మేఘాలు బుధవారం సాయంత్రానికి తొలిగాయి. పవన్ కళ్యాణ్ గతంలోనూ పలు చిత్రాలకు పారితోషికం వదిలేసుకున్నాడు. సొంత బ్యానర్ల పై తీసిన 'జాని". 'గుడంబా శంకర్" లకి కూడా అతనికి సరైన పారితోషికం అందలేదు. సినిమా పరాజయానికి తనదే బాధ్యత అనుకుంటూ నిర్మాత భారాన్ని మోమడం పవన్ కి అలవాటైపోయినట్టుంది విడుదలయ్యేలా చూడండి..బ్యాలెన్స్ సంగతి తర్వాత చూద్దామంటే, సినిమా రిలీజయ్యాక డబ్బులిచ్చేదెవరు చెప్పండి..?


Click it and Unblock the Notifications











