twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ కల్యాణ్‌ - ఫోక్ సాంగ్స్ (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా...' అంటూ పవన్ కళ్యాణ్ పాడిన పాట తాలూకు వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు పలు పాటలను పవన్‌కల్యాణ్ పాడినప్పటికీ వాటి విజువల్స్ బయటికి రాలేదు. కానీ ఈ పాటను పవన్ పాడుతున్నప్పుడు చిత్రీకరించి, ఆదివారం విడుదల చేశారు. ఇప్పటివరకు పవన్ పాడిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. యూ ట్యూబ్‌లో రెండు రోజుల్లోపే ఐదు లక్షలమందికి పైగా ఈ పాటను వీక్షించడం విశేషం. ఆ విధంగా ఇది సూపర్ డూపర్ హిట్టయ్యిందని అంచనా వేయొచ్చు.

    ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫోక్ సాంగ్స్ పై ఉన్న ఇంట్రస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో పరిచయమున్నవారు చెప్పేదేమిటంటే..పవన్ కి మొదటి నుంచి జానపదాలంటే ఆసక్తి. అందులోనూ ఉత్తరాంధ్ర జానపదాలంటే మరీను. ఆ పాటలు ప్రత్యేకంగా సేకరించి మరీ ఆయన వింటూంటారు. ఆ విషయం తెలిసిన ఆయన సన్నిహితులు సైతం ఆ పాటలు ఎక్కడ దొరికినా ఆయనకు పంపుతూంటారు.

    ఇక ఆయనకు నచ్చిన పాటలను ఆయన తన సినిమాల్లో పెడుతూంటారు. ఆ రకంగా ఆ జానపదాలకు విస్తృత ప్రచారమూ లభిస్తుందనేది ఆయన ఆలోచనగా చెప్తూంటారు. ఇప్పుడు తాజాగా చేసిన 'కాటమ రాయుడు..' పాట 1940లో విడుదలైన 'సుమంగళి'లో నుంచి తీసుకున్నది. ఆ పాటతో మళ్లీ ఒక్కసారిగా అంతా ఆ జానపదాన్ని సుమంగళిని తలుచుకుంటున్నారు. ఓ రకంగా అది పవన్ ..జానపదాలకు చేస్తున్న మేలుగా అభివర్ణిస్తున్నారు.

    పవన్ సినిమాల్లో వచ్చిన జానపదాలు పరిశీలిస్తే...

    ‘తమ్ముడు' లో...

    ‘తమ్ముడు' లో...

    పవన్‌కల్యాణ్‌కి ఫోక్ సాంగ్స్ అంటే మొదటి నుంచీ చాలా ఇష్టం. అందుకు ఉదాహరణగా ‘తమ్ముడు' చిత్రంలోని ‘నబో నబో నబరి గాజులు..' మనకు కనిపిస్తాయి. ‘తమ్ముడు' సినిమా విడుదలైన కొత్తలో ఈ పాట ..అందరిలో నానింది. ఆ పాట క్లిక్ అవటంతో పవన్ ఆ తరహా పాటలను పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తారు. తమ్ముడు చిత్రం కూడా ఘన విజయం సాధించి పవన్ కెరీర్ లో ఓ పెద్ద మైలు రాయిగా మిగిలిపోయింది.

    ‘గుడుంబా శంకర్'లో...

    ‘గుడుంబా శంకర్'లో...

    వీరశంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గుడుంబా శంకర్'లోని ‘కిళ్లి కిళ్లి కిళ్లి కిళ్లీ.. నమిలాక బాగున్నదే..' అనే పాట కూడా అప్పుడు అందరూ హ్యాపీగా ఆశ్వాదించారు. మీరా జాస్మిన్ కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం ఊహించిన విధంగా విజయం సాధించకపోయినా... ఇప్పుడొస్తున్న ఫన్,హీరోయిన్ ని రక్షించటం అనే కాన్సెప్టు చిత్రాలకు నాంది చిత్రంగా నిలిచింది.

    స్వీయదర్శకత్వంలోని ‘జానీ'లో..

    స్వీయదర్శకత్వంలోని ‘జానీ'లో..

    తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘జానీ'లో చేసిన ‘నారాజు గాకుర మా అన్నయ్య..' పాట కూడా బాగా అలిరించింది. ఇప్పటికీ టీవిలు వాళ్లు ఈ పాటను ఎప్పుడూ వేస్తూంటారు. ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది. . ఆ పాటకు పవన్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించాయి.రేణు దేశాయ్ తో చేసిన ఈ చిత్రం ఫెయిల్యూర్ అయినా...మిగతా విభాగాల్లో మంచి నాణ్యత గల చిత్రంగా నిలిచింది.

    ‘ఖుషీ' కోసం రీమిక్స్ ...

    ‘ఖుషీ' కోసం రీమిక్స్ ...

    అలాగే తనకిష్టమైన పాత హిట్ సాంగ్స్‌ని రీమిక్స్ చేయిస్తుంటారు పవన్‌కల్యాణ్. ‘మిస్సమ్మ'లోని ‘ఆడువారి మాటలకు...' పాటను ‘ఖుషీ' కోసం రీమిక్స్ చేయించారు. ఆ పాటమరో సారి ప్రేక్షకాదరణ పొందింది. ఖుషి పవన్ కెరీర్ లో బెస్ట్ చిత్రంగా చెప్తారు. ఇప్పటికీ ..పవన్ కి హిట్ వచ్చినప్పుడల్లా దాన్ని ఖుషీ తో పోలుస్తూండటం పరిపాటి.

    ‘జానీ' కోసం కూడా రీమిక్స్

    ‘జానీ' కోసం కూడా రీమిక్స్

    ‘చిట్టి చెల్లెలు'లోని ‘ఈ రేయి తీయనిది..' చాలా బాగుంటుంది. ఈ పాటను ‘జానీ' కోసం రీమిక్స్ చేశారు. ఈ పాట సైతం ప్రేక్షకాదరణ పొందింది. సినిమా విజయవంతమైతే సినిమా సక్సెస్ లో దీనికీ భాగం ఉండేదని చెప్పుకోవాల్సినంతగా ఈ పాట కుదిరింది. ఈ పాటతో పవన్ టేస్ట్ ఏమిటనేది తేట తెల్లమైంది. మరిచిపోతున్న చక్కటి పాటలకు ఆయన మళ్లీ పునర్జీవితం ఇస్తూంటారు.

    లేటెస్ట్ గా... ‘అత్తారింటికి దారేది'లో

    లేటెస్ట్ గా... ‘అత్తారింటికి దారేది'లో

    త్రివిక్రమ్ దర్శకత్వంలో త్వరలో విడుదల కానున్న ‘అత్తారింటికి దారేది'లో కూడా అలాంటి ఓ పాట ఉంది. ‘కాటమ రాయుడు..' పాట 1940లో విడుదలైన ‘సుమంగళి'లో నుంచి తీసుకున్నది. ఈ పాట కూడా ఇప్పుడు అందరి నోట్లలో నానుతోంది. ఇక.. ఈ చిత్రాన్ని ఈ 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ రోజున సినిమాని విడుదల చేయడంలేదని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రనిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్ గా నటించారు.

    English summary
    Pawan Kalyan’s ‘Kaatam Rayuda’ song has gone viral. The song has become immensely popular on social networks and it has generated more than 5,00,000 views within 2 days on Youtube. More than the song itself, Pawan’s fans are delighted with their hero’s animated gestures while singing the song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X