పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’దెబ్బకి ‘లవ్లీ’ఎస్కేప్..
మీడియాలో పాపులర్ అయిన టైటిల్స్ నే ఇక తప్పక పెట్టుకోవాల్సిన ప్రస్థుత పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ 'లవ్లీ"గా ఎస్కేప్ అయ్యారు. ప్రస్తుతం పవర్ స్టార్ చేస్తోన్న 'లవ్ ఆజ్ కల్" రీమేక్ కి 'లవ్లీ" పేరుతో ఇప్పటికే విశేష ప్రాచుర్యం లభించినప్పటికీ ఫైనల్ గా ఆ చిత్రానికి 'తీన్ మార్"టాగ్ లైన్(సెలబ్రేషన్స్ ఆప్ లవ్)అనే టైటిల్ ని నిర్థారించడం విశేసం. నిజానికిది ప్యూర్ లవ్ స్టోరి అయినా పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే పలు అంశాలను రంగరిస్తూ అభిమానుల చేత 'తీన్ మార్" ఆడించే రేంజ్ లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇచ్చారట. అలాగే లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ జయంత్ యువతరాన్ని ఊపేసే స్థాయిలో ఈ చిత్రాన్ని మలుస్తూ కుర్రకారు చేత 'తీన్ మార్" చేయించే అద్భుతమైన అవుట్ ఫుట్ తెచ్చారట.
ఇక మణిశర్మ మరోసారి పవన్ సినిమా కోసం చాలా 'ఖుషీ"గా బాణీలను సమకూర్చి రేపు ప్రతీ థియేటర్ లోనూ 'తీన్ మార్" తథ్యం అనిపించే ఆడియోని రెడీ చేశారట. ఇలా అన్నివిధాలా ఆ టైటిల్ కి తగ్గట్టే సినిమా వుంటుందనే రిపోర్ట్ వినవస్తోన్న నేపథ్యంలో పవర్ స్టార్ 'తీన్ మార్" పాత రికార్డులన్నిటినీ తిరగరాస్తుందనే ఆశలు రేకెత్తుతున్నాయ్. మొత్తానికి మెగా ఫ్యాన్స్ ని మళ్ళీ 'తీన్ మార్" మూడ్ లోకి తీసుకువచ్చేసిన పవర్ స్టార్ ఏప్రిల్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ లో 'తీన్ మార్" మొదలెట్టేందుకు సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











