‘మహేష్ ఖలేజా’ని ఫాలో అయిపోయిన ‘పవన్ కళ్యాణ్ లవ్ లీ’
పవన్ కళ్యాణ్, త్రిష, కృతికర్బందా హీరో, హీరోయిన్లుగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి 'ఖుషీగా" అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ గత వారం రోజులుగా 'ఖుషీగా" కాదు 'లవ్ లీ" అనే టైటిల్ తో పవన్ చిత్రం వస్తోంది అనే న్యూస్ కూడా వచ్చింది. అయితే...ఇప్పటి తాజా సమాచారం ప్రకారం ఈ రెండు టైటిల్స్ కాదు...'పవన్ కళ్యాణ్ లవ్ లీ" అనే టైటిల్ ను పెట్టారు. ఈ టైటిల్‌ను ఇటీవలే ఫిల్మ్‌ఛాంబర్ లో కూడా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రానికి మాటలు: త్రివిక్రమ్, సంగీతం: మణిశర్మ.
కాగా మెన్న మహేష్ బాబు చిత్రానికి కూడా ఖలేజా కాస్తా మహేష్ ఖలేజా గా మార్చారు..నిన్న కత్తి కాస్తా కళ్యాణ్ రామ్ కత్తిగా చేశారు..ఇప్పుడు లవ్ లీ కాస్తా 'పవన్ కళ్యాణ్ లవ్ లీ"గా ట్విస్ట్ ఇచ్చారు...


Click it and Unblock the Notifications











