twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగుదనం ఉట్టిపడేలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘లవ్లీ’

    By Sindhu
    |

    'పులి' సినిమా తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఇటీవలే సౌతాఫ్రికాలో పూర్తయింది. ఇందులో పవన్, త్రిషలపై ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపుదిద్దికొంటున్న చిత్రం 'లవ్లీ" షూటింగ్ బుదవారం నుండి మైసూరు లో చిత్రీకరించనున్నట్టు తాజా సమాచారం. భారీ బడ్జెట్‌ తో తీస్తున్న లవ్లీలో పవన్ డబుల్ రోల్ చేస్తున్నారని, ఈ సినిమాలో బెంగుళూరుకు చెందిన కృతి కర్బంద మరో హీరోయిన్ గా నటిస్తున్నది.

    కాగా మంగళవారం మధ్యాహ్నం పూనే నుంచి పవన్ కళ్యాణ్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన వెంట ముద్దుల కుమారుడు అఖీరాను తీసుకు వచ్చారు. ఇది తెలుసుకొన్న మెగా అభిమానులు అక్కడకు చేరుకొని పవన్ కళ్యాణ్ ను చుట్టిముట్టి పూలమాలలతో ముంచెత్తారు. పవన్ కుమారుడు అభిమానులతో కలిసి ఉల్లాసంగా గడిపారు.

    ఈ సందర్బంగా చిత్ర నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ 'లవ్ ఆజ్ కల్" హిందీ సినిమా రీమేక్ గా లవ్లీ తెరకెక్కిస్తున్నామన్నారు. అయితే సినిమాకి సంబందించి కొన్ని మార్సులు, చేర్పులు చేస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా అన్ని రకాల హంగులతో లవ్లీ చిత్రీకరిస్తున్నామన్నారు. మైసూరులో ఈ రోజు నుండి సినిమా షూటింగ్ మొదలైవుతుంది. ఇక్కడ షూటింగ్ పూర్తి అయిన తరువాత అమెరికాలో షూటింగ్ ఉంటుందని గణేష్ అన్నారు. ఇప్పటి వరకు పవన్ చిత్రాలు ఒక ఎత్తు. లవ్లీ ఒక ఎత్తు అని ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కసిగా ఎదురు చూస్తున్నారని గణేష్ తెలియజేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X