స్నేహమంటే ఇదేనా.. అలీపై పవన్ కళ్యాణ్ అటాక్!

అన్ని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధాన పార్టీలో విజయం కోసం జోరుగా ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లని ఆకర్షించే పనిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం రోజుతో ప్రచారాలకు బ్రేక్ పడనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. సోమవారం రోజు రాజమండ్రి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ అలీ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

వైసిపిలో అలీ

వైసిపిలో అలీ

అలీ రాజకీయాల్లోకి వచ్చే విషయంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురిని కలిసిన తర్వాత అలీ వైసీపిలో చేరేందుకు మొగ్గు చూపి జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆ సందర్భంలో అలీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ రాజకీయం వేరు, స్నేహం వేరు అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తనని జనసేనలోకి ఆహ్వానించలేదు అని కూడా మాట్లాడారు.

అలీ పరిచయం చేసిన వ్యక్తికి

అలీ పరిచయం చేసిన వ్యక్తికి

పవన్ కళ్యాణ్ తాజాగా రాజమండ్రి బహిరంగ సభలో మాట్లాడుతూ.. అలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలీ నా స్నేహితుడు. అతడు పరిచయం చేసిన వాళ్ళ బంధువుకు నరసారావు పేట ఎంపీ టికెట్ ఇచ్చా. కానీ వారు మాత్రం నన్ను వాడుకుని వదిలేశారు. ఇదేనా స్నేహమంటే అలీ అంటూ పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. అందుకే తాను స్నేహితులని, బంధువులని ఎక్కువగా నమ్మడం మానేశానని పవన్ అన్నారు.

 నాపై నమ్మకం లేదు

నాపై నమ్మకం లేదు

నాపై నమ్మకం లేక అలీ వైసిపిలో చేరాడు. ఆ పార్టీకి విజయం సాధిస్తుందని అలీ భావించినట్లు ఉన్నాడు. కానీ వైసిపి కూడా అలీని వాడుకుని వదిలేసింది. అలీతో ఎప్పుడూ ప్రేమగా, స్నేహంగా ఉండేవాడిని. అలాంటి వ్యక్తి కూడా నన్ను నమ్మలేదు. నాకు అలాంటి వాళ్ళు అవసరం లేదు. నేను నమ్మింది మిమ్మల్నే అంటూ పవన్ అభిమానులని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

మెగా హీరోల మద్దతు

మెగా హీరోల మద్దతు

ఇదిలా ఉండగా జనసేన పార్టీకి మెగా హీరోల నుంచి మద్దతు లభిస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, నిహారిక జనసేన పార్టీ కోసం నరసాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. రాంచరణ్, అల్లు అర్జున్ ప్రచారంలోకి దిగకున్నా నైతిక మద్దతు మాత్రం ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X