అదే నా అఖరి సినిమా.. ఇక నేను చేయకూడదని నిర్ణయించుకున్నా.. : పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. ఆయన ప్రజలకు సేవనందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్నారు. ఇక తాజాగా విశాఖ పట్నంలో వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్... తన గత సినిమాల గురించి, విశాఖ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రచార పర్వం వేగవంతం చేశారు. ఇటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా.. సినిమాల్లో ఎంత బిజి ఉన్నప్పటికీ.. రాజకీయాలకు కూడా సమయాన్ని వెచ్చిస్తూ.. ప్రజల మధ్యే ఉంటున్నారు. ఇప్పటికే బ్రో సినిమా పూర్తి చేసి.. రిలీజ్ కూడా చేశారు. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ లో బిజిగా గడుపుతున్నారు పవన్. మరోవైపు హరిహర వీరమల్లు సినిమా కూడా చేయాల్సి ఉంది కానీ... పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా అది ఎన్నికల తర్వాతే అని తెలుస్తోంది.

Pawan Kalyan made interesting comments about his films during the Varahi Yatra held in Visakhapatnam.

ఇక పవన్ కల్యాణ్ తాజాగా విశాఖ పట్నం వారాహి యాత్రలో పాల్గొన్నారు. ఆయన వారాహి బండిపై నిలబడి ప్రసంగించారు. పవన్ కల్యాణ్ స్పీచ్ వినడానికి ఎన్నోో వేల మంది అభిమానులు, కార్యకర్తలు.. అక్కడికి తరలి వచ్చారు. అంతే కాదు.. పవన్ కల్యాణ్ స్పీచ్ విని.. చప్పట్లు, పూలతో అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఇక పవన్ విశాఖ పట్నం వారాహి యాత్రలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.... 25 సంవత్సరాల క్రితం.. సుస్వాగతం సినిమాకి.. ఇదే జగదాంబ సెంటర్లో.. ఓ బస్సు మీద ఎక్కించి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. 25 సంవత్సరాల తర్వాత మళ్లీ వారాహి ఎక్కి మీతో మాట్లాడాల్సి వస్తోంది. ఆరోజన నేను పబ్లిక్ లైఫ్ లోకి ఎందుకు వచ్చాను.. సినిమా నటుడిని ఎందుకు అయ్యాను అని నన్ను నేను తిట్టుకునే వాడిని. పది మధ్యకు రావాలంటే సిగ్గు. మా వదినకు ఫోన్ చేసి ఎందుకు నేను నటుడిని అయ్యాను. అదే అఖరు సినిమా.. ఇక చేయకూడదు అని నిర్ణయించుకున్నాను.. అని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan made interesting comments about his films during the Varahi Yatra held in Visakhapatnam.

ఇక ఆయన ఇంకా ఏం చెప్పారంటే... కాలం ఎంత గొప్పది అంటే... పారిపోనివ్వకుండా సినిమాల్లోనే ఉంచింది. మీకోసం పని చేసేలా ఇక్కడే నిల్చోబెట్టి... మళ్లీ పాతిక సంవత్సరాల తర్వాత అదే జగదంబా సెంటర్లో ఈసారి సినిమా కోసం కాదు. మన రాష్ట్రం కోసం.. మన ప్రజల కోసం.. మన సమాజం కోసం. ఈ సారి నేను ఎవరికి కంప్లైంట్ చేయట్లేదు.. పోయిన సారి మా వదినకు కంప్లైంట్ చేశాను... కానీ ఈసారి ఎవరికి చేయను.. అంటూ వెల్లడించారు.

చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా ఇన్ని కోట్ల మంది ప్రజల కోసం... ఇలాంటి ప్రభుత్వంతో పోరాటడానికి ఆ గుండె దైర్యం విశాఖ పట్నం ఇచ్చింది. నాలోని సిగ్గును పొగొట్టింది విశాఖ. నాలో ధైర్యాన్ని ఇచ్చింది. పది మంది మధ్యకు రావడానికి భయపడే నన్ను... భయం పోయేలా చేసింది. ఏదైనా సరే మన ఉత్తరాంధ్ర.. సంస్కృతి, సాహిత్యం నేర్పించింది విశాఖ. అలాంటి విశాఖలో ఉన్న అందరికీ పేరుపేరునా నమస్కారం. కృతజ్ఞతలు... అని వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X