శ్రీరెడ్డికి తొలిసారి ఎటాక్ .. తల్లిని తిట్టినందుకు సినీ హీరోగా ఉంటే అదే చేసేవాడిని.. పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్బావం సందర్భంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. నన్ను, నాతల్లిని దూషిస్తున్న వ్యక్తులను ఎందుకు భరిస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేశారు. సినీ నటుడిగా ఉంటే తాను ఏమి చేసేవాడినో అదే చేసేవాడిని.. రాజకీయ పార్టీ నేత కావడంతో వాటిని భరిస్తున్నాని చెప్పారు. స్వార్ధం కోసం రాజకీయాల్లోకి ప్రవేశించలేదని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ఏం చెప్పారంటే..

 నన్ను తక్కువగా అంచనా వేస్తే

నన్ను తక్కువగా అంచనా వేస్తే

నేను సినిమాల్లోకి రావాలనుకొన్నప్పుడు ఈ అబ్బాయితో ఎంత బడ్జెట్‌తో సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందనే చర్చ జరిగింది. కొందరు 70 లక్షలని, మరికొందరు కోటి రూపాయలని వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. అలా పరిమితం చేయడం నాకు నచ్చలేదు. అలా వారి మాటలకు ప్రభావితం అయి ఉన్నట్లయితే.. ఇప్పుడు ఇలా కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకొనే వాడిని కాదేమో. అందుకే ఒకరిని పరిమితం చేసి నా మాట్లాడకూడదనేది నా అభిప్రాయం. ఎవరి వద్ద ఎలాంటి టాలెంట్ ఉంటుందో అంచనా వేయడం కష్టం అని పవన్ కల్యాణ్ అన్నారు.

దిశ ఎన్‌కౌంటర్ సరే..సుగాలి ప్రీతి మాటేంటి?

దిశ ఎన్‌కౌంటర్ సరే..సుగాలి ప్రీతి మాటేంటి?

దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తే చప్పట్లు కొట్టి ఆనందపడ్డాం. అదే కర్నూలులో రెసిడెన్షియల్ కాలేజ్‌కు వెళ్లిన అమ్మాయికి గురైతే ఎవరు మాట్లాడరా? పోలీసు శాఖ సపోర్టు చేయరు? అన్ని రకాల ఆధారాలు ఉన్నా ఎందుకు పట్టించుకోరు. వీరిని ఎన్‌కౌంటర్ చేయరా? ఇలాంటి పరిస్థితులు మారాలంటే ప్రతీ ఒక్కరు మాట్లాడాలి. మాట్లాడితినే సుగాలీ ప్రీతి కేసు సీబిఐకి అప్పగించారు అని పవన్ కల్యాణ్ అన్నారు.

స్వార్ధం కోసం రాజకీయాల్లోకి రాలేదు

స్వార్ధం కోసం రాజకీయాల్లోకి రాలేదు

సినిమాలు వదిలేసి నా స్వార్ధం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఇంతమంది చేత మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల రాజకీయ నేతలు నాపై దుర్బాషలు ఆడుతున్నారు. ఒకవేళ రాజకీయ నాయకుడిగా కాకుండా.. యాక్టర్‌ను అయి ఉంటే,గతంలో నేను యాక్టర్‌గా ఎలాంటి పనులు చేశానో అలాంటివి చేసే వాడిని అని పవన్ పేర్కొన్నారు.

నా తల్లిని బూతులతో తిట్టినా

నా తల్లిని బూతులతో తిట్టినా


గతంలో నా తల్లిని దూషించారు. నా తల్లిని ఓ బూతు మాట వాడి తిట్టారు. ఇన్ని రకాల తిట్లు ఎందుకు పడ్డాను. ఉప్పుకారం తిన్న నా శరీరానికి పౌరుషం ఉండదా? కోపం రాదా? కడుపు మండదా? ఈ కోపాన్ని ఎందుకు భరిస్తున్నానంటే.. నా కోపాన్ని దాటి ఉన్నాను కాబట్టే ఇలాంటి భరిస్తున్నాను అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Recommended Video

Tollywood Inside Talk | Pspk27 | RRR | NTR 30 | PSPK 27 | Chiru 152 | Prabhas 20
సినిమా నటుడిగా ఉంటే..

సినిమా నటుడిగా ఉంటే..

సినిమా నటుడిగానే ఉంటే.. ఈ కోపాన్ని భరించే వాడిని కాదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు ఈ సమాజం ఓ కుటుంబం లాంటింది. సినిమా నటుడిగా ఉంటే.. సుగాలి ప్రీతి తల్లి నా వద్దకు వచ్చి మొరపెట్టుకొంటే.. నాలో ఏం చేయలేని నిస్సహాయత మాత్రమే ఉండేది. ఇంట్లో కూర్చొని ఏడుస్తూ.. బాధపడుతూ మరిచిపోయేవాడిని అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X