అప్పుడు రోదించా.. కన్నీళ్లు వచ్చేవి.. అరవింద్, శేఖర్ కమ్ములపై పవన్ కల్యాణ్ వార్
Recommended Video

జనసేన పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థలపై అవగాహన నేపథ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ చేపట్టిన పర్యటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆయన ఎక్కు పెడుతున్న విమర్శలు రాజకీయ విశ్లేషకులను ఆలోచింపజేస్తున్నాయి. తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత అల్లు అరవింద్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

అరవింద్ తప్పు చేశాడు..
రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ ప్రజారాజ్యం విలీనంపై స్పందించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న సమయంలో అల్లు అరవింద్ స్పందించకపోవడం తప్పు అని పవన్ అన్నారు. ఒకవేళ చిరంజీవి తపపు చేస్తే.. మీరు తప్పు చేస్తున్నారు అని అరవింద్ చేయాల్సి ఉండాలని పవన్ అన్నారు.

ఆయనకు ప్రేమ లేదు
ప్రజారాజ్యంపై మీకు ప్రేమ ఉంటే అలా వ్యవహరించే వారు కాదునే విధంగా అల్లు అరవింద్‌పై పవన్ ఫైర్ అయ్యారు. ప్రజారాజ్యం విలీన సమయంలో మౌనం దాల్చడంపై కూడా వివరణ ఇచ్చారు. నేను ఓ పార్టీలో నాయకుడి నేతృత్వలో పనిచేసేటప్పుడు ఆ లీడర్‌న నమ్ముతాను అని అన్నారు. దానినే సర్వెంట్ లీడర్ షిప్ అంటారని పేర్కొన్నారు.

నేను నిస్సహాయుడిని
ఒక ఆలోచనా విధానంతో నాయకుడు ముందుకెళ్తున్నప్పుడు అతడిని అనుసరించాల్సిందే. అప్పుడు విలీన వ్యవహారం చాలా ఇబ్బందిని కలిగించింది. ఆరోజు నేను చెబితే వినే పరిస్థితి లేదు. ఆ సమయంలో నేను నిస్సహాయుడ్ని. ఇప్పుడైతే నాకు బలం ఉంది. అనుభవం తర్వాత వచ్చింది అన్నారు.

నన్ను ఓ నటుడిగానే
ప్రజారాజ్యం సమయంలో అల్లు అరవింద్ తీరుపై మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ని ఫలానా చోటకి ప్రచారానికి పంపించండి అంటే.. ఎందుకండీ.. మనకు అల్లు అర్జున్ ఉన్నాడుగా, రామ్‌చరణ్ ఉన్నాడుగా.. వారిని పంపించండి అని అరవింద్ చేసిన కామెంట్లను ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

ఎవరూ వినలేదు.. కన్నీళ్లు పెట్టుకొన్నా..
అప్పుడు నాకనిపించింది ఏమిటంటే అల్లు అరవింద్ నన్ను నటుడిగానే చూశారు. పవన్ కల్యాణ్ అనే వాడు తన కొడుకు, మేనల్లుడితో పాటు ఒక నటుడని అల్లు అరవింద్‌కు అనిపించింది. ఆయనకు నాలో ఉన్న సామాజిక స్పృహ ఏ మాత్రం కనిపించలేదు. ఇలాంటి వాతావరణంలో ఇంక నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారండి? అందుకనే చేతులు కట్టుకుని రోధించేవాడ్ని. కన్నీళ్లు కూడా బయటికి వచ్చేవి కావు'' అని పవన్ కల్యాణ్ అన్నారు.

శేఖర్ కమ్ములపై విమర్శలు
ఎన్నికల సమయంలో బీజేపీ అధినేత నరేంద్రమోదీకి మద్దతు తెలుపడంపై దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన ట్వీట్‌పై పవన్ స్పందించారు. జాతికి ద్రోహం చేస్తున్నారనే విధంగా శేఖర్ కమ్ముల ట్వీట్ తనకు గుర్తుందని ఆయన అన్నారు. ఇలా సినీ ప్రముఖులపై కూడా పవన్ వార్ ప్రకటించడంపై సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











