twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోర్బ్స్ 2018: సంపాదనలో పవన్ టాప్, మహేష్‌ను మించిన ఎన్టీఆర్, చెర్రీతో సమంగా విజయ్ దేవరకొండ!

    |

    ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ ప్రతి ఏడాది మాదిరిగానే 2018లో ఎవరు ఎంత సంపాదించారు అనే వివరాలు విడుదల చేసింది. సెలబ్రిటీల కేటగిరీలో విడుదల చేసిన టాప్ 100 లిస్టులో రూ. 253.25 కోట్ల సంపాదనతో సల్మాన్ ఖాన్ మొదటిస్థానం దక్కించుకున్నారు.

    సల్మాన్ తర్వాతి స్థానంలో టాప్ 10 లిస్టులో విరాట్ కోహ్లి (రూ. 228.09 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ. 185 కోట్లు), దీపిక పదుకోన్ (రూ. 112.8 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ. 101.77 కోట్లు), అమీర్ ఖాన్ (రూ. 97.5 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ. 96.17 కోట్లు), రణవీర్ సింగ్ (రూ. 84.67 కోట్లు), సచిన్ (రూ. 80 కోట్లు), అజయ్ దేవగన్ (రూ. 74.5 కోట్లు) ఉన్నారు.

     టాప్ 25 లిస్టులో పవన్ కళ్యాణ్

    టాప్ 25 లిస్టులో పవన్ కళ్యాణ్

    2018 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పివి సింధు, పవన్ కళ్యాణ్ టాప్ 25లో ఉన్నారు. రూ. 36.5 కోట్ల సంపాదనతో పివి సింధు 20వ స్థానంలో... రూ. 31.33 కోట్ల సంపాదనతో పవన్ కళ్యాణ్ 24వ స్థానంలో ఉన్నారు.

    మహేష్ బాబును మించి పోయిన జూ ఎన్టీఆర్

    మహేష్ బాబును మించి పోయిన జూ ఎన్టీఆర్

    ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం... సంపాదన పరంగా 2018లో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబును మించిపోయాడు. జూ ఎన్టీఆర్ రూ. 28 కోట్ల సంపాదనతో 28వ స్థానంలో, మహేష్ బాబు రూ. 24.33 కోట్ల సంపాదనతో 33వ స్థానంలో ఉన్నారు

    ఇద్దరు సౌత్ హీరోయిన్లకే ఛాన్స్

    ఇద్దరు సౌత్ హీరోయిన్లకే ఛాన్స్

    ఇక ఫోర్బ్స్ టాప్ 100 లిస్టులో ఇద్దరు సౌత్ హీరోయిన్లకు మాత్రమే చోటు దక్కింది. తాప్సీ రూ. 15.48 కోట్ల సంపాదనతో 67వ స్థానంలో, నయనతార రూ. 15.17 కోట్ల సంపాదనతో 69వ స్థానంలో ఉన్నారు. అయితే తాప్సీ సంపాదన అంతా కూడా బాలీవుడ్ సినిమాల ద్వారానే రావడం గమానార్హం.

     రామ్ చరణ్, బన్నీ స్థానం ఎంత?

    రామ్ చరణ్, బన్నీ స్థానం ఎంత?

    ఈ టాప్ 100 లిస్టులో మెగా ఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్‌లకు చోటు దక్కింది. అల్లు అర్జున్ రూ. 15.67 కోట్ల సంపాదనతో 64వ స్థానంలో, రామ్ చరణ్ రూ. 14 కోట్ల సంపాదనతో 72వ స్థానంలో ఉన్నారు.

    సీనియర్ హీరోల్లో నాగ్ ఒక్కరే

    సీనియర్ హీరోల్లో నాగ్ ఒక్కరే

    ఇక టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నాగార్జున ఒక్కరే ఇందులో చోటు దక్కించుకున్నారు. నాగార్జున రూ. 22.25 కోట్ల సంపాదనతో 36వ స్థానంలో ఉన్నారు.

    కొటరటాల శివకు ఛాన్స్

    కొటరటాల శివకు ఛాన్స్

    ఇక దర్శకుడు కొరటాల శివకు ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో చోటు దక్కింది. కొరటాల శివ రూ. 20 కోట్ల సంపాదనతో 39 వ స్థానంలో ఉన్నారు.

    చెర్రీతో సమానంగా విజయ్ దేవరకొండ

    చెర్రీతో సమానంగా విజయ్ దేవరకొండ

    టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సైతం ఫోర్బ్స్ 100 లిస్టులో చోటు దక్కించుకున్నాడు. విజయ్ దేవరకొండ రూ. 14 కోట్ల సంపాదనతో 72వ స్థానంలో ఉన్నారు. రామ్ చరణ్ కూడా 14 కోట్ల సంపాదనతో 72వ స్థానంలో నిలిచారు.

    English summary
    Bollywood actor Salman Khan has topped Forbes India's 2018 list of richest Indian celebrities with earnings amounting to Rs 253.25 crore. Tollywood star Pawan Kalyan took the 24th spot with total earnings of Rs 31.33 crore. Mahesh Babu, NTR, Nagarjuna, Koratala Shiva, Allu Arjun, Ram Charan and Vijay Devarakonda also in the list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X