మళయాళంలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ ..
తొలిసారి మలయాళంలో నటిస్తున్న తెలుగు స్టార్ హీరో పవన్ కల్యాణ్. ఆయన పాత్ర కథలో ఎంతో కీలకమైనది ఈ నెల 30న ముంబయిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈజిప్ట్, ఇజ్రాయెల్, ఇటలీ తదితర దేశాల్లో చిత్రీకరణ ఉంటుందంటున్నారు 'ఆదిత్య ప్రొడక్షన్స్' అధినేత కొండా కృష్ణంరాజు. ఆయన... గతంలో 'విజయేంద్ర వర్మ', 'శ్రీరామదాసు' నిర్మించి తన తృతీయ ప్రయత్నంగా యేసుక్రీస్తు జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరక్షన్ చేస్తున్నారు. 12, 14 సంవత్సరాల వయసు కలిగిన బాల తారలతో ఈ చిత్రాన్ని ఆయన నాలుగు భాషల్లో నిర్మిస్తుండటం విశేషం.
ఈ కథలో ఒక కీలకమైన...కథకు ప్రాణం అని చెప్పదగిన పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారని, ఆ పాత్ర తెలుగు, మలయాళం భాషల్లో ఆయన చేస్తున్నారని కృష్ణంరాజు చెప్పారు. ఆయా చిత్రాల్లో రెండు భాషలకు చెందిన ఇద్దరు ప్రముఖ కథానాయికలు పవన్ కళ్యాణ్ సరసన నటిస్తారని, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తయారయ్యే వెర్షన్స్‌లో ఆ భాషలకు చెందిన ప్రముఖ హీరో, హీరోయిన్లు ఉంటారని ఆయన వివరించారు. ఈ చిత్రానికి రచన: జె.కె.భారవి, కెమెరా: శేఖర్ వి.జోసెఫ్, ఆర్ట్: రవీందర్, మేకప్: క్రిస్టియానా టిన్స్ లే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శేషు.


Click it and Unblock the Notifications











