చాలా కాలం తరువాత పవన్‌తో త్రివిక్రమ్.. చాయ్ గ్లాసుతోనే మొదలు పెట్టారు
సౌత్ సినిమా ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ కాంబినేషన్స్ లలో త్రివిక్రమ్, పవన్ కాంబో ఒకటి. చివరగా వీరి కాంబోలో డిజాస్టర్ పడినప్పటికి మళ్ళీ కాంబినేషన్ సెట్స్ పైకి వస్తే అంచనాల డోస్ మామూలుగా ఉండవు. అయితే వీరి కలయికలో మరో సినిమా రావాలని అభిమానులు ఎంతో బలంగా కోరుకోగా ఒక విదంగా అది నెరవేరింది. పవన్ యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమాకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు.
ఘనంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటాషా దలాల్ వివాహం (ఫొటోలు)

ఆ సినిమా ఇప్పుడొచ్చి ఉంటే..
జల్సా సినిమాతో ఈ కాంబినేషన్ లో ఏ రేంజ్ లో హిట్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా గనక ఇప్పుడు విడుదలయ్యి ఉంటే బాక్సాఫీస్ వద్ద ఉహీంచని రికార్డులు క్రియేట్ అయ్యేవి. ఆ సినిమా టీవీలలో టెలిక్యాస్ట్ అయినప్పుడు రేటింగ్స్ కూడా బాగానే అందుకుంటుంది. ఇక ఆ తరువాత పవన్ తీన్ మార్ సినిమాను త్రివిక్రమ్ మాటలు అందించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.

లీక్ అయినప్పటికీ..
ఇక అత్తారింటికి దారేది సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్కసారిగా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. సగం సినిమా ఒరిజినల్ ప్రింట్ విడుదల సమయంలోనే లీక్ అయినప్పటికీ కలెక్షన్స్ విషయంలో హవా ఏ మాత్రం తగ్గలేదు. అప్పుడే పవన్, త్రివిక్రమ్ కాంబోపై అంచనాల డోస్ మరో స్థాయికి వెళ్లింది. త్రివిక్రమ్, పవన్ తో కలిసి చేసిన మూడవ సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఆ సినిమా మొత్తం త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే..
ఇక పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేయకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యంగా వీరి కలయికపై పెరిగే అంచనాలే అని టాక్ వస్తోంది. ఈ సారి డైరెక్ట్ గా కాకపోయినా మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు త్రివిక్రమ్. అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు మొదటి నుంచి కూడా బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూనే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. దర్శకుడు సాగర్ చంద్ర అయినప్పటికీ సగం వరకు త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే సినిమా తెరకెక్కుతుందట.
పవన్, త్రివిక్రమ్ చేతుల్లో చాయ్ గ్లాస్ లు
ఇక ఆ సినిమా షూటింగ్ సోమవారమే హైదరాబాద్ లోని ఒక పాత అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలుకాగా అందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అందుకు పవన్ సింపుల్ లుక్ లో కనిపించాడు. ఇక చివరలో పవన్, త్రివిక్రమ్ చేతుల్లో చాయ్ గ్లాస్ లు కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది సమ్మర్ అనంతరం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీలుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Recommended Video


Click it and Unblock the Notifications











