పవన్ - రానా మల్టీస్టారర్.. మొత్తానికి అదే టైటిల్ ఫిక్స్ చేసేలా ఉన్నారు
టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ హవా మళ్ళీ మొదలైంది. పొలిటికల్ ఎంట్రీ తరువాత అసలు సినిమాలు చేస్తాడా చేయడా అని అనుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా విభిన్నంగా మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. మళయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన యాక్షన్ థ్రిల్లర్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాలో రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక సినిమా టైటిల్ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అదే ఇంట్రెస్టింగ్ పాయింట్..
రానా ఈ సినిమాలో నటిస్తున్నాడు అనగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్, రానా మధ్యలో ఫైట్స్ ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. దర్శకుడు సాగర్ చంద్ర ఇద్దరు డిఫరెంట్ స్టార్స్ ను సమానంగా చూపించాల్సి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ పాత్రను ఏ స్థాయిలో ప్రజెంట్ చేస్తారు అనేది మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్.

హీరోయిన్స్ ఫిక్స్ అయినట్లే..
ఇక సినిమాలో హీరోయిన్స్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న పవన్ కళ్యాణ్ పాత్రకు జోడిగా సాయి పల్లవి ఫిక్స్ అయినట్లు మొదటి నుంచి ఒక టాక్ అయితే వస్తోంది. ఇక ఇటీవల రానా ప్రాజెక్టులో జాయిన్ అవ్వడంతో అతని కోసం ఐశ్వర్య రాజేష్ ను ఫైనల్ చేసినట్లుగా సమాచారం.

అయ్యప్పనుమ్ కొశీయుమ్..అంటే?
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ యొక్క ప్లానింగ్ అయితే రెడీ అవుతోంది. మరికొన్ని రోజుల్లో మొత్తం యూనిట్ సభ్యులు హైదరాబాద్ లో జరగబోయే మొదటి షెడ్యూల్ లో
పాల్గొనబోతున్నారు. ఇక అందరి చూపు ఎక్కువగా సినిమా టైటిల్ పైనే ఉంది. మళయాళంలో మాత్రం అయ్యప్పనుమ్ కొశీయుమ్ అంటే హీరోల పాత్రల పేర్లు. దాన్నే టైటిల్ గా పెట్టారు. ఇక తెలుగులో ఎలా సెట్ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.

ముందు అనుకున్న టైటిల్.. ఫిక్స్
ఇక ఫైనల్ గా తెలుగులో అయితే బిల్లా రంగా అనే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1982లో మోహన్ బాబు, చిరంజీవి నటించిన సినిమా టైటిల్ కూడా బిల్లా రంగనే. ఇక ఇప్పుడు రానా, పవన్ సినిమాకు కూడా అదే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ రూమర్స్ వచ్చాయి. కానీ అది నిజం కాదనే టాక్ కూడా వచ్చింది. ఇక చిత్ర యూనిట్ ఇప్పుడు ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











