పవన్ కల్యాణ్‌ త్వరలోనే సీఎం అవుతాడు.. పక్కాగా రాసి పెట్టుకో బ్రదర్..

తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలను పోషించారు. విలన్‌గా, సాఫ్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. తాజాగా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

 చిరంజీవితో నటించాలంటే..

చిరంజీవితో నటించాలంటే..

చిరంజీవి గొప్ప నటుడు అనడంలో ఎలాంటి అనుమానాలు వద్దు. ఆయన పక్కన నటించాలంటే అదృష్టం ఉండాలి. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. త్వరలోనే ఆ అవకాశం రావాలని కోరుకొంటున్నాను. ఆయన పక్కన నటించేంత స్థాయికి ఎదగాలని కోరుకొంటున్నాను అని శ్రీకాంత్ అయ్యంగార్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్‌తో ఒక్కసారి నటించా

పవన్ కల్యాణ్‌తో ఒక్కసారి నటించా

పవన్ కల్యాణ్‌తో వ్యక్తిగతంగా నాకు పరిచయం లేదు. ఆయనతో ఒకే ఒక సినిమాలో నటించాను. అజ్ఞాతవాసి చిత్రంలో ఆయనతో ఓ సీన్‌ల చిన్న వేషం వేశాను. అప్పుడు ఆయనతో రెండు మాటలు మాట్లాడాను. నేను మీకు ఫ్యాన్‌ అని చెప్పాను. నా మాటలకు ఆయన చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయారు అని శ్రీకాంత్ అయ్యంగార్ అన్నారు.

పవర్ స్టార్‌ను చూస్తుంటే అలా

పవర్ స్టార్‌ను చూస్తుంటే అలా

పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా వినయంగా, హుందాగా ఉంటారు. ఆయనలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే.. పూర్తిగా ఆయనే. పవర్ స్టార్ అలా నిలబడితే ఓ మ్యాగ్నెట్‌లా అతుకుపోయి చూడాలనిపిస్తుంది. ఆయన మంచి, గొప్ప వ్యక్తి అనేది అందరికి తెలిసిందే. ఆయనతో పూర్తి స్థాయిలో వేషం వేసి నటించాలనన్నది నా కోరిక అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు.

రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రను

రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రను

పవన్ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ గురించి నాకు తెలియదు. ఆయన ఫిలాసఫీ, పొలిటికల్ ఐడియాలజీ నాకు తెలియదు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రను నిర్వర్తించనున్నారనే విషయం నాకు తెలుసు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని బలంగా నమ్ముతాను. ఆయనకు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే అది నిజం కావొచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరుగడానికి అవకాశం ఉందనే అభిప్రాయాన్ని అని శ్రీకాంత్ అయ్యంగార్ వ్యక్తం చేశారు.

 మోడీ అంటే ఇష్టం కానీ.. ఇప్పుడు వ్యతిరేకత

మోడీ అంటే ఇష్టం కానీ.. ఇప్పుడు వ్యతిరేకత

నేను రాజకీయాల్లో చేరను. కానీ నాకు దేశం గురించి, రాజకీయాల గురించి ఆలోచిస్తాను. నాకంటూ ఓ అభిప్రాయం ఉంది. రాజకీయాల్లో ఉండే మంచి వ్యక్తులకు నేను సహకారం అందిస్తాను. మంచి కోసం మనమంతా పాటుపాడాలి. నేతలు తప్పు చేస్తే వ్యతిరేకించాలి. నాకు మోడీ అంటే ఇష్టం కానీ..పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన అంటే వ్యతిరేకత ఏర్పడుతున్నది. పెట్రోల్ రేట్లు పెంచితే మనిషి బతకాలా వద్దా అని శ్రీకాంత్ అయ్యంగార్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X