తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలకు కష్ట కాలమేనా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి పోయి రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ ప్రాంతంలో తిప్పలు తప్పవనే చర్చ మొదలైంది. ఇటీవల ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ టీఆర్‌ఎస్ పార్టీని, ఆపార్టీ అధినేత కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల విషయం హాట్ టాపిక్ అయింది.
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'కొమురం పులి' తెలంగాణ వాదుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అదే విధంగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం కూడా వివాదాస్పదం అయింది. ఈచిత్రంలోని సన్నివేశాలు, డైలాగులపై తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. సినిమా ప్రదర్శన నిలిపి వేసాయి.
నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఏమిటి? టీఆర్ఎస్ గవర్నమెంటులో పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? అనే అంశం చర్చనీయాంశం అయింది. గతంలో రాష్ట్రం కలిసి ఉండేది కాబట్టి తెలంగాణ వివాదాలకు సంబంధించిన సినిమాల గొడవలు తొందరగానే సద్దుమనిగేవి. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా వేరు.

నైజాంలోనే ఎక్కువ
పపన్ కళ్యాణ్ సినిమాలకు ప్రధానమైన, ఎక్కువ వసూళ్లు చేసే మార్కెట్ ‘నైజాం' ఏరియానే కావడం విశేషం.

అత్తారింటికి దారేది
పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం నైజాం ఏరియాలో 24 కోట్లు వసూలు చేసింది.

గబ్బర్ సింగ్-2
త్వరలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హిందీ చిత్రం ‘ఓ మై గాడ్' తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈచిత్రంలో వెంకటేష్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. డాలి దర్శకత్వం వహించబోయే సినిమాను సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











