పవన్ కళ్యాణ్, నేను బ్యాగులు సర్దేసుకున్నాం.. చిరంజీవి కాల్, నువ్వెళ్లిపోతే నాపరిస్థితి ఏంట్రా!

Recommended Video

Art Director Anand Sai Talks About Pawan Kalyan

తన సినీరంగ ప్రవేశం అనుకోకుండా జరిగిందని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందునుంచి తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితెలిపాడు. తొలిప్రేమ నటి వాసుకి, ఆనంద్ సాయి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు జరిగిన ఆసక్తికర ఘటనని ఆనంద్ సాయి పంచుకున్నారు.

పవన్ చెప్పిందే వేదం

పవన్ చెప్పిందే వేదం

అనేక విషయాల్లో మాఇద్దరి ఆలోచన విధానం ఒకటే అని ఆనంద్ సాయి తెలిపారు. అందువలనే తామిద్దరం మంచి స్నేహితుల అయ్యాం అని ఆనంద్ సాయి తెలిపారు. అప్పట్లో నాకు పవన్ కళ్యాణ్ చెప్పిందే వేదం. ఏం చెప్పిన ఓకె అనేవాడిని అంటూ ఆనంద్ సాయి తెలిపారు.

ఇంకా క్లారిటీ లేదు

ఇంకా క్లారిటీ లేదు

లైఫ్ లో ఎం చేయాలి అనే క్లారిటీ ఇంకా లేని సమయంలో పవన్ కళ్యాణ్ హీరో అయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను బిజినెస్ పట్టాలని భావించా. కానీ కుదరడం లేదు. ఆ సమయంలో కొన్ని రోజులపాటు ఇంటినుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం అని ఆనంద్ సాయి తెలిపారు.

బ్యాగులు సర్దుకుని

బ్యాగులు సర్దుకుని

కొని రోజులు బయటకు వెళుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఇంట్లో చెప్పేశాను అని అన్నాడు. నేను కూడా మా ఇంట్లో చెప్పేశా. ఎందుకు అని అడిగితే.. బిజినెస్ పెడతాను అని అంటే మీరు ఇంకా ఏ విషయం తేల్చడం లేదు అందుకే వెళుతున్నా అని చెప్పా.

సరిగ్గా అప్పుడే

సరిగ్గా అప్పుడే

తమ ప్రయాణానికి సరిపోయే వస్తువులు అని రెడీ చేసుకుని టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ సమయంలోనే చిరంజీవి గారు హైదరాబాద్ నుంచి పవన్ కి ఫోన్ చేశారు. అర్జెంట్ గా హైదరాబాద్ వచ్చేయ్ రా అని అన్నారు. అన్నయ రమ్మన్నారు.. నేను హైదరాబాద్ వెళుతున్నా అని పవన్ ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా నేనేం చేయాలి అని నేను కూడా ఇంటికి వెళ్ళిపోయా.

ఫోన్ ద్వారా టచ్‌లో

ఫోన్ ద్వారా టచ్‌లో

హైదరాబాద్ పవన్ తొలి చిత్రం ఏర్పాట్లు చిరంజీవి మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ తో ఫోన్ లో టచ్ లో ఉన్నాం. ఆ తరువాత పవన్ నటించిన తొలి ప్రేమ చిత్రానికి ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X