దాడి : అభిమానిని స్వయంగా కలిసిన పవన్ (ఫోటోస్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిపై ‘గోపాల గోపాల' ఆడియో వేడుకలో దాడి జరిగిన సంగతి తెలిసింది. ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత స్వయంగా కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ చెప్పినట్లే కలిసారు. వైద్యం ఖర్చుల నిమిత్తం రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు.
గోపాల గోపాల' ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా ఓ అభిమానిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శిల్పకళా వేదిక ఆవరణలో బ్లేడ్ పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి చిత్రాన్ని మీడియాకు అందించిన పోలీసులు అతని ఆచూకీ తెలిస్తే, 9493549415, 9491030063 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిపై ‘గోపాల గోపాల' ఆడియో వేడుక వద్ద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దాడి ఘటన తనను ఎంతగానో డిస్ట్రబ్ చేసింది. నేను స్వయంగా వెళ్లి కలుస్తాను. ఇలాంటి జరుకుండా చూడాలని రిక్వెస్ట్ చేసారు.
‘నిన్న ‘గోపాల గోపాల' ఆడియో వేడుకలో అభిమానిపై జరిగిన దాడి ఘనటన నన్ను ఎంతగానో డిస్ట్రబ్ చేసింది. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత స్వయంగా వెళ్లి కలుస్తాను. భవిష్యత్తులో ఇలాంటి జరుగకుండా చూడాలని అభిమానులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ సేఫ్టీ నాకు అత్యంత ముఖ్యమైన విషయం' అని ట్వీట్ చేసారు.

పవన్ కళ్యాణ్
దాడి జరిగిన అభిమానిని పవన్ కళ్యాణ్ కలిసారు.

పరిశీలన
బ్లేడుతో గొంతు కోసిన భాగాన్ని పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్

ఆర్థిక సహాయం
వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తున్న పవన్

అభిమాని కుటుంబ సభ్యులతో
పవన్ కళ్యాణ్ అభిమాని కుటుంబ సభ్యులతో కలిసి పవన్

అభిమానం
అభిమాని శ్రీనివాస్ తో కలిసి ఇలా....

ఆప్యాయంగా
అభిమాని కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ అప్యాయంగా పలకరించారు

పిల్లలతో...
అభిమాని శ్రీనివాస్ పిల్లలతో పవన్ కళ్యాణ్ సంతోషంగా గడిపారు.

సంఘటన గురించి
దాడి సంఘటన గురించి అడిగి తెలుసుకుంటున్న పవన్ కళ్యాణ్
గోపాలగోపాల సినిమా ఆడియో ఫంక్షన్ హడావిడిలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఈ ఆడియో పంక్షన్ టికెట్లు ఇవ్వలేదని దుండగులు పవన్‌కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం శిల్పకళా వేదిక వద్ద జరిగింది. గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన కరుణ శ్రీనివాస్ (31) పవన్ కల్యాణ్ అభిమాన సంఘం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు. హయత్‌నగర్‌లోని గంటవారిపాలెంలో నివాసముంటున్నాడు. వెంకటేష్, పవన్‌కల్యాణ్ నటించిన గోపాల-గోపాల సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన 20 టికెట్లను వేదిక వద్ద తన స్నేహితులకిస్తుండగా దుండగులు వచ్చి తమకూ కావాలని అడిగారు. నిరాకరించిన శ్రీనివాస్ గొంతు, మెడపై బ్లేడ్‌తో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలి న శ్రీనివాస్‌ను అక్కడే ఉన్న పోలీసులు మాదాపూర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణహాని తప్పింది.


Click it and Unblock the Notifications











