»   » పవన్‌ని కలిసిన శ్రీజ, సంతోషం వ్యక్తం చేసిన పవర్ స్టార్(ఫోటోస్)

పవన్‌ని కలిసిన శ్రీజ, సంతోషం వ్యక్తం చేసిన పవర్ స్టార్(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో బాధపడి పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఓదార్పుతో తిరిగి కోలుకున్న 'శ్రీజ' తన తల్లిదండ్రులు నాగయ్య,నాగమణి సోదరి షర్మిల శ్రీ లతో కలసి ఈ రోజు (సోమవారం) ఉదయం తన అభిమాన నటుడు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'ను ఆయన కార్యాలయంలో కలిశారు. దాదాపు రెండుగంటల సమయం 'పవన్ కళ్యాణ్' శ్రీజ కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ గడిపారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' మాట్లాడుతూ..' శ్రీజ పూర్తి ఆరోగ్యవంతురాలు కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీజ కు వైద్యం చేసిన డాక్టర్ 'అసాదారణ్' కు కృతఙ్ఞతలు తెలిపారు. 'శ్రీజ' కుటుంబ సభ్యులు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను కలవటం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.

స్లైడ్ షోలో ఫోటోలు....

బ్రెయిన్ ఫీవర్

బ్రెయిన్ ఫీవర్

బ్రోయిన్ ఫీవర్ కారణంగా శ్రీజ తీవ్ర అనారోగ్యం పాలైంది. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందింది.

పవన్ కళ్యాణ్ ను చూడాలని కోరిక

పవన్ కళ్యాణ్ ను చూడాలని కోరిక

అనారోగ్యం సమయంలో తన అభిమాన హీరో పవన్ కళ్యాన్ ను చూడాలని శ్రీజ కోరుకోవడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి కలిసారు.

ఆవేదనకు గురైన పవన్

ఆవేదనకు గురైన పవన్

పవన్ కళ్యాణ్ శ్రీజను ఆసుపత్రిలో పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఆమె పరిస్థితి తీవ్రంగా ఉండటం చూసి పవన్ కళ్యాణ్ చలించి పోయారు.

ఆర్థిక సహాయం

ఆర్థిక సహాయం

శ్రీజ ఆరోగ్యం బాగు పడటం కోసం అప్పట్లో పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సహాయం కూడా చేసారు.

English summary
Pawan Kalyan meets his fan Srija at his home.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu