»   » పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం అలానే ఉంటాడా?

పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం అలానే ఉంటాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్లో కనిపించిన అన్ని ఫోటోల్లోనూ కేవలం పోలీస్ డ్రెస్ లో మాత్రమే కనిపించారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఎక్కువగా పోలీస్ డ్రెస్ లోనే కనిపిస్తారని స్పష్టమవుతోంది.

ఇంతకు ముందు వచ్చిన పవన్ కళాణ్ ‘గబ్బర్ సింగ్' పూర్తి స్థాయి పోలీస్ సబ్జెక్టు సినిమానే. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్సులతో పాటు ఇతర క్యాజువల్ డ్రెస్సులోనూ కనిపించారు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో మాత్రం ఆయన పూర్తి స్థాయిలో పోలీస్ డ్రెస్ లోనే కనిపిస్తారని స్పష్టమవుతోంది.

Pawan Kalyan mostly seen in the police get up

సీన్ల వరకు ఒకే కానీ... పాటల్లో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్సులోనే కనిపిస్తారా? లేక కలర్ ఫుల్ క్యాజువల్ డ్రెస్సుల్లో కనిపిస్తారా? అనేది హాట్ టాపిక్ అయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిసేందుకు వచ్చిన సమయంలో కూడా పోలీస్ డ్రెస్ లోనే రావడం అందరినీ ఆశ్యర్య పరిచింది. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ సినిమా కోసం క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారనేది స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ గుజరాత్ లో జరుగుతోంది. ఇక్కడి కచ్ ఏరియాలో కొన్ని ఫైట్ సీన్లతో పాటు, కీలకైమన సీన్లు చిత్రీకరిస్తారు. వాస్తవానికి ఈ ఏరియాలో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లోనే జరుగాల్సి ఉంది. అయితే అక్కడ షూటింగ్ పర్మిషన్స్ విషయంలో లేట్ కావడంతో ఇపుడు షూటింగ్ ప్లాన్ చేసారు.

English summary
Whenever Pawan Kalyan is spotted on the shooting sets of Sardaar Gabbar Singh, he is only seen in police attire. So this is now creating a curiosity, about the number of police scenes in the film.
Please Wait while comments are loading...