'పంజా' గెటప్స్ పై పవన్ తల్లి కామెంట్స్
సినిమాల్లో ఎట్లా నిజాయితీగా ఉంటాడో అలాగే మామూలుగా కూడా నిజ జీవితంలో కూడా ఉంటాడు..అందుకనే వాడికంత రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు పవన్ తల్లి అంజనా దేవి. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజాపై ఆయన తల్లి అంజనాదేవి మీడియాతో మాట్లాడారు.అలాగే పవన్ వ్యక్తిత్వం గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. అలాగే చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు వాడి మనసత్వం ఎలా ఉండేదో ఇప్పటికీ అలాగే ఉంది. లోతు మనిషి,అందరితో ఉన్నా కానీ వాడు ఒక్కడే ఉంటాడు. ఇక పంజా చిత్రంలో కళ్యాణ్ బాబు గెటప్ చాలా బాగుంది. ముఖ్యంగా రెండు మూడు గెటప్స్ చాలా బాగున్నాయి. కలకత్తాలో చూసాను అబ్బాయిని..గడ్డంతో ఉన్నాడు..ఏంటబ్బా గడ్డంతో ఉన్నాడు అనుకున్నాను. కానీ పవన్ నాతో లేదమ్మా గెడ్డంతో బాగుంటుంది అని అన్నాడు. అలాగే పవన్ లో నచ్చే గుణం ఎక్కువ ఏమీ లేకుండా సింపుల్ సిటి అంటున్నారామె. నేనే మా అబ్బాయి ఫ్యాన్ ని ..తర్వాతే మిగతా వాళ్లు అన్నారామె.
ఇక పంజా ఆడియో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఎక్కడ విన్నా ఆ పాటలే వినిపిస్తున్నాయి. మరో ప్రక్క ఈ చిత్రం ఫస్ట్ లుక్ మార్కెట్ వర్గాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కలకత్తా మాఫియా నేపధ్యంలో జరిగే కథ. తమ పంజా చిత్రంలో దెబ్బ తిన్న పులి లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనని దర్శకుడు విష్ణు వర్ధన్ అంటున్నారు. ఆయన తన తాజా చిత్రం పంజా చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ...ఒక్క దెబ్బతో నాడీ వ్యవస్థను సైతం విచ్ఛిన్నం చేసే పవర్ పులి పంజాకి సొంతం. అదే దెబ్బతిన్న పులి అయితే... దాన్ని పంజా శక్తి రెట్టింపవుతుంది. ఇక ఎదుట ఉన్నది మదగజం అయినా సరే.. మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రణ ఇదే తరహాలో ఉంటుంది. ఆయన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కి రుచి చూపించే సినిమా ఇది అన్నారు.
కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు:అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్:అనూవర్థన్.


Click it and Unblock the Notifications











