పవన్ కళ్యాణ్ పార్టీకి అంజనా దేవి విరాళం: తల్లిని చూసి పవర్ స్టార్ భావోద్వేగం (ఫోటోస్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫోకస్ అంతా రాజకీయాలపై పెట్టి సంగతి తెలిసిందే. ప్రజలకు మంచి జరిగేలా రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలని తపిస్తున్న ఆయన జనసేన పార్టీ స్థాపించి తన శక్తి మేరకు పోరాటం కొనసాగిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌‌కు తన కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోంది. తాజాగా ఆయన తల్లి అంజనా దేవి హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయానికి వచ్చి పార్టీ ఫండ్ కోసం విరాళం అందించారు.

పవన్ కళ్యాణ్ భావోద్వేగం

పవన్ కళ్యాణ్ భావోద్వేగం

తను స్థాపించిన రాజకీయ పార్టీకి విరాళం అందించడానికి వచ్చిన తన తల్లిని చూసి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.

 రూ. 4 లక్షలు విరాళం

రూ. 4 లక్షలు విరాళం

ఈ సందర్భంగా అంజనా దేవి తన తరుపున జనసేన పార్టీకి రూ. 4 లక్షల విరాళం అందించారు. ప్రజల కోసం నువ్వు చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగ అంజనీ దేవి తన కుమారుడికి స్పష్టం చేశారు.

అక్కడే చెక్ రాసిచ్చారు

అక్కడే చెక్ రాసిచ్చారు

చెక్ బుక్‌తో జనసేన కార్యాలయానికి వచ్చిన అంజనా దేవి... అక్కడే స్వయంగా చెక్ రాసి పవన్ కళ్యాణ్‌కు అందించారు. పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమతో కూడుకున్నదని, అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్‌కు ఈ సందర్భంగా అంజనా దేవి తెలిపారు.

Recommended Video

Pawan Kalyan Gets Applauds From Posani Krishna Murali
ఆ డబ్బులే విరాళంగా

ఆ డబ్బులే విరాళంగా

భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్ల తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ మొత్తాన్నే జనసేన పార్టీకి విరాళంగా అందచేసినట్లు అంజనా దేవి ఈ సందర్భంగా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X