twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan ఆయన విప్లవకారుడు.. అణగారిన వర్గాలకు గొప్పయోధుడు.. ట్రెండింగ్‌గా పవన్ కల్యాణ్ స్పీచ్

    |

    భాగ్య నగర ప్రతిష్టను దేశవ్యాప్తంగా పెంపొందించిన శ్రీ రామానుజచార్యులు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాలు పంచుకొన్నారు. దేశానికి సమతామూర్తిగా నిలిచిన శ్రీరామానుజచార్యులను ఘనంగా కీర్తించారు. సమతామూర్తి విగ్రహాన్ని శనివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

    ఆదివారం సాయంత్రం జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి హైదరాబాద్‌కు సమీపంలోని ముచ్చింతలో ప్రతిష్టించిన సమతామూర్తి విగ్రహాన్ని పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పూర్తిదాయకమైన ప్రసంగంలో అన్ని మతాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ చేసిన పూర్తి ప్రసంగం ఇలా సాగుతూ..

    జై శ్రీమన్నారాయణ అంటూ

    జై శ్రీమన్నారాయణ అంటూ

    పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జై శ్రీమన్నారాయణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అధ్యాత్మిక సభల్లో మాట్లాడకూడదని అనుకొంటాను. కానీ ప్రస్తుతం మాట్లాడాలనిపిస్తున్నది. గత సంవత్సరం శ్రీ చిన జీయర్ స్వామిని కృష్ణానది తీరంలోని ఆయన మఠంలో కలిశాను. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు నా మనసును తాకాయి. నీ మతాన్ని ఆరాధించు. నీ దైవాన్ని ఆరాధించు. ఎదుటి దైవాన్ని కూడా గౌరవించు. మన మతాన్ని ఆరాధిస్తూనే ఎదుటి మతాలకు సంబంధించిన దైవాన్ని గౌరవించడమే భారత దేశపు గొప్ప లక్షణం అని పవన్ కల్యాణ్ అన్నారు.

    హిందూ జీవన విధానం గొప్ప‌గా

    హిందూ జీవన విధానం గొప్ప‌గా

    శ్రీ రామానుజాచార్యుల విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేశంలో జీవన విధానం ఎన్నో ఏళ్లుగా ఎందుకింత బలంగా నిలబడి ఉందంటే.. తప్పొప్పులను ప్రశ్నించే అవకాశం ఉంది. కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగినప్పుడు వారికి అండగా నిలిచి ప్రశ్నించే సందర్భాలు అనేకంగా కనిపిస్తాయి. ఇది భారతదేశపు సనాతన సంప్రదాయం గొప్ప లక్షణం. అందుకే ఎన్ని సమస్యలు, సవాళ్లు వచ్చినా తట్టుకొని నిలబడుతూనే ఉంది. మన సంప్రదాయాలు, హిందూ జీవన విధానం గొప్ప అని చెప్పడానికి ఇది నిదర్శనం అని పవన్ కల్యాణ్ అన్నారు.

    భారతదేశంలోనే ప్రశ్నించే హక్కు

    భారతదేశంలోనే ప్రశ్నించే హక్కు

    శ్రీరామానుజచార్యులు జగత్ ఆచార్యులు అనడానికి ముందు ఆయన గొప్ప విప్లవకారుడిగా కనిపిస్తారు. అణగారిన వర్గాలకు ఆలయ ప్రవేశం లేనప్పడు.. భగవంతుడిని చేరుకొనే అవకాశం పరిమితమైనప్పుడు వాటిని ఎదురించి నిమ్న వర్గాలకు ఆలయ ప్రవేశం చేయించే అవకాశం కల్పించారు. ఇలాంటి సంఘటనలు వేరే దేశాల్లో జరిగితే.. మత గురువులను బలి తీసుకొన్న సందర్బాలు ఉన్నాయి. కానీ భారతదేశంలోనే ప్రశ్నించే హక్కు కనిపిస్తుంది. అలాంటి ప్రశ్నించే తత్వాన్ని బోధించిన గొప్ప వ్యక్తి రామానాజుచార్యులు అని పవన్ కల్యాణ్ చెప్పారు.

    216 అడుగుల విగ్రహం ఏర్పాటు

    216 అడుగుల విగ్రహం ఏర్పాటు

    తమ మతాన్ని కాకుండా ఇతర మతాలను గౌరవించాలి.. అందరికి ఆలయ ప్రవేశం ఉండాలనే విషయాన్ని బోధించిన శ్రీ రామానుజ చార్యులు వారిని గుండెల్లో పెట్టుకొనే విధంగా.. చరిత్రలో ఆయన గురించి అందరికి తెలిసే విధంగా విగ్రహాన్ని ప్రతిష్టించడం గొప్ప విషయం.

    అతడి గొప్పతనాన్ని భారతదేశ ప్రజలకు తెలిసే విధంగా 216 అడుగులపై చిలుకు విగ్రహాన్ని స్థాపించడం గర్వంగా ఉంది. ఇది విగ్రహం కాదు.. ఓ సమతామూర్తిగా చూడాలి. విభిన్న సంప్రదాయాలు, సంస్కృతికి సంకేతంగా సమతామూర్తిని నెలకొల్పడానికి కారణమైన శ్రీ తిదండి చిన జియర్ స్వామి మహా సంకల్పమే దోహదపడింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

    Recommended Video

    10th Class Diaries Teaser Launch | BVS Ravi About His 10th Class Memories | Filmibeat Telugu
    దేశంలోని 108 ఆలయాల నమూనాలు

    దేశంలోని 108 ఆలయాల నమూనాలు

    భావి తరాలకు మనం డబ్బు ఇస్తే సరిపోదు. వారికి జానం పంచిపెట్టాలి. ప్రజల్లో సమానత్వం కోసం, రామానుజచార్యులను కీర్తించిన ఆళ్వారుల అండ ఉంది. 2016 అడుగుల ఎత్తైన విగ్రహమే కాకుండా దేశంలోని 108 దేవాలయాల నమూనాను ఇక్కడ స్థాపించడం గొప్ప విషయం. సమతామూర్తి విగ్రహం భాగ్యనగరానికి సరికొత్త చిహ్నంగా మిగిలిపోతుంది. రామానుజచార్యులు తీర్థం మహాతీర్థంగా వర్ధిల్లాలి అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

    English summary
    Pawan Kalyan motivational speech at Statue of Equality Aka Samata Murthy Sri Ramanujacharyulu statue. Pawan Kalyan said Sri Ramanujacharyulu is revolutionary leader.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X