twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పాట్ డబ్బింగ్ లేని పవన్-విష్ణువర్థన్ ల సినిమా..!?

    By Sindhu
    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు సినిమా 'తీన్ మార్" లో స్పాట్ డబ్బింగ్ టెక్నిక్ లోపభూష్టంగా ఉందని సర్వత్ర విమర్శలు ఎదురైనా సంగతి తెలిసిందే. డబ్బింగ్ లో క్వాలిటీ లేదంటూ సినీ విమర్శకులు, పవన్ అభిమానులు దీనిపై ఫిర్యాదులు చేసారు. ఈ ఫీడ్ బ్యాక్ ను పవన్ కళ్యాణ్, తన తదుపరి చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్ సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నట్టు వినిపిస్తోంది.

    ఫలితంగా పవన్ కొత్త సినిమాకు స్పాట్ డబ్బింగ్ ఉండదు. బదులుగా సాధారణ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సెషన్ అక్టోబర్ 1వ తేది నుంచి మొదలవుతుంది. చిత్ర షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడ చాల ముఖ్యం అంటున్నారు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ. అందుకోసమే అత్యంత ఉన్నతమైన సాంకేతిక జట్టు ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యకలాపాలు చూస్తుందని చెప్పారు.

    ఈ సినిమా అధికారికంగా పేరు మరియు లోగో, మొదటి ట్రైలర్స్ విజయదశమి రోజున విడుదల చేస్తారు. ఆడియోను నవంబర్ లోనూ, చిత్రం విడుదలను డిసెంబర్ లో చేయాడానికి సిద్దం చేస్తున్నారు. ఈ చిత్రం టెక్నికల్ గా చక్కగా రూపుదిద్దుకొందని చిత్ర నిర్మాత తెలుపుతున్నారు. ఈ చిత్రానికి పవర్, షాడో, కాళి తదితర టైటిల్స్ షికారు చేస్తున్నాయి. అయితే ఇవి ఏవీ కరెక్ట్ కాదని తెలుస్తుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సారా జేన్ డియాస్ మరియు అంజలి లవనియా కథానాయికలుగా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ లో ఉంటుందని భావిస్తున్నారు..

    English summary
    Pawan Kalyan’s upcoming film under Vishnuvardhan direction has completed talkie part shooting. The film’s shoot is almost done except for a song to be shot on Pawan Kalyan. Post Production work started today. Spot dubbing is not used for this film as it was miserably failed in Teen Maar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X