పవన్ వెంటపడి మరీ సాధించుకున్న దిల్ రాజు...!?
పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'ఖుషి". ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అప్పటి నుంచి పవన్ తో ఓ సినిమా చేసే ఛాన్స్ కోసం దిల్ రాజు దాదాపు పదకొండేళ్ళుగా ఎదురు చూస్తున్నాడట. అయితే ఆయన కల త్వరలో నెరవేరనుందని తెలుస్తోంది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంలో పవన్ నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్లేస్ లో మహేష్ నటిస్తుండటంతో దిల్ రాజు పవన్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొన్ని నెలలుగా పవన్ చుట్టూ తిరుగుతున్న దిల్ రాజు చాలా సిట్టింగ్స్ జరిపారని ఈ మధ్యనే పవన్ ఓ స్క్రీప్ట్ ని ఫైనలైజ్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల కథనం. పవన్ వెంటపడి మరీ సాధించుకున్న దిల్ రాజుకి పవన్ తో సినిమా చేయాలనే పట్టుదలకు హాట్సాఫ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
ప్రస్తుతం తన బ్యానర్ లో వర్క్ చేస్తున్న తన అసోసియేట్ తో పవన్ కళ్యాణ్ కి ఓ కథ చెప్పించి మరీ ఒప్పించాడని సమాచారం. కాగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో 2012లో కార్యరూపం దాల్చే అవకాశం వుందని తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం 'పంజా", గబ్బర్ సింగ్ చిత్రాల షూటింగుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











