twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ మున్నీ కంటే హాట్ గా పవన్ కళ్యాణ్ ‘మున్నీ...'!?

    By Sindhu
    |

    పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మాతగా 'మిరపకాయ్" వంటి హిట్ ను ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'గబ్బర్ సింగ్". ఈ చిత్రాన్ని హిందీలో విజయవంతమైన 'దబాంగ్" చిత్ర ఆధారంగా రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న 'గబ్బర్ సింగ్" సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ నటిస్తోంది.

    హిందీ 'దబాంగ్" చిత్రం పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్ సింగ్" పేరిట తెలుగులో రీమేక్ అవుతోన్న హిందీ వెర్షన్ లోని హిట్ సాంగ్ 'మున్నీ..." పాట తెలుగులో కూడా ఉంటుందని జనాలు అనుకుంటున్నారు. కానీ తెలుగు వెర్షన్ కి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ అదే ట్యూన్ ని తెలుగులో కాపీ కొట్టడంలేదని చెబుతున్నాడు.

    అంతకంటే బెటర్ ట్యూన్ నేను చేయగలనని, ఆ ట్యూన్ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తాననే నమ్మకం నాకుందని అంటున్నాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంతో పాపులర్ అయిన 'మున్నీ.." పాటకు ధీటుగా ట్యూన్ చేయడం అంత సులభం కాదు. కానీ దేవిశ్రీ ప్రసాద్ ఛాలింజింగ్ గా ఈ విషయాన్ని తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అదరగొట్టే ట్యూన్ తో వస్తాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఇంకా సుహాసిని, అజయ్, అభిమన్యు సింగ్, నాగినీడు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ ను తమిళనాడులోని పొల్లాచ్చిలో చిత్రీకరించేందుకు ఏర్పాటు చేశారు. ఇక్కడ పవణ్, శృతి హాసన్ లపై కొన్ని కీలక సీన్లు చిత్రీకరించనున్నారు.

    English summary
    Music Director Devi Sri Prasad is back in limelight with new and fresh feel tunes composed for ‘Oosaravelli.’ The next big task for DSP would be ‘gabbar singh’ of Pawan Kalyan. Film being a remake to Bollywood flick ‘Dabangg,’ the first song that comes into mind will be ‘Munni Badnaam’ which rocked the entire Nation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X