twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ టీడీపీలో చేరికపై మెగా బ్రదర్ నాగబాబు స్పందన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు తెలుగు దేశం పార్టీలో చేరుతున్నారనే వార్తలు కేవలం రూమర్లే అని అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ అయింది. నాగబాబు ఈ వార్తలను స్వయంగా ఖండించారు. మెగా ఫ్యామిలీ పీఆర్ఓ ఎస్‌కెఎన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

    ఎస్‌కెఎన్ తన ట్విట్టర్లో పేర్కొంటూ...'మెగా బ్రదర్ నాగబాబు గారు తాను, తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను స్వయంగా ఖండించారు. తాము ఎవరినీ కలవ లేదని కూడా స్పష్టం చేసారు' అని ట్వీట్ చేసారు. స్టార్ రైటర్ కోన వెంకట్ కూడా ట్విట్టర్లో స్పందిస్తూ...'పవన్ కళ్యాణ్ గురించిన రూమర్లను నమ్మ వద్దు, ఇవన్నీ నిరాధారమైనవి' అని స్పష్టం చేసారు.

     Pawan Kalyan, Nagababu Not Joining TDP

    కాగా...పవన్ కళ్యాణ్, నాగబాబు తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతుంతోంది. వీరిద్దరూ రహస్యంగా బాలకృష్ణను కలిసారని, పార్టీలో చేరే విషయమై చర్చించారని పుకార్లు షికార్లు చేసాయి. టీడీపీ అగ్రనేత యనుమల రామకృష్ణుడు కూడా.....వారు పార్టీలోకి వచ్చే అవకాశాలను ఖండించలేం, వస్తే ఆహ్వానిస్తాం అని పేర్కొనడం కూడా ఈ రూమర్లకు మరింత బలాన్ని ఇచ్చినట్లు అయింది.

    మరో వైపు పవన్ కళ్యాణ్ టీడీపీ కండువాతో ఉన్న ఫోటోలు, బాలకృష్ణను కలిసినట్లు ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. జాతీయ మీడియాలో కూడా ఈ విషయం చర్చనీయాంశం అయింది. తెలుగు న్యూస్ టీవీ చానళ్లు కూడా ఈ రూమర్లకు మరింత మసాలా అద్దడంతో.....రాష్ట్ర మంతటా ఇదో హాట్ టాపిక్ అయింది. తాజాగా నాగబాబు ఖండన, ఎస్‌కెఎన్ ట్వీట్‌తో ఈ రూమర్లకు తెర పడినట్లయింది.

    English summary
    Power Star Pawan Kalyan and actor Nagababu, who are brothers of Union Tourism Minister K Chiranjeevi, are not joining politics through TDP (Telugu Desam Party) or any other party, confirmed SKN, the official PRO for the Mega family. It was rumoured that the Mega brothers had secret meetings with Nandamuri Balakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X