'పంజా'లో పవన్ పాత్ర పేరు

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా పై రోజు కో వార్త అభిమానులను అలరిస్తోంది. లేటెస్టుగా ఈ చిత్రంలో పవన్ పాత్ర పేరు జై అని తెలుస్తోంది.పాపారాయుడు పాటలో బ్రహ్మానందం అతన్ని జై అని పిలుస్తాడు.అంతేగాక నిర్మాత సైతం ఈ పేరుని పవన్ కి పెట్టామని కన్ఫర్మ్ చేసారు.అయితే మాఫియా డాన్ గా ఉండేటప్పుడు పవన్ క్యారక్టర్ పేరు జాక్సన్ రాబర్ట్ అని సమాచారం.అలాగే మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డ్యుయెల్ రోల్స్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ పాత్ర, ప్రజెంట్ లో ఓ పాత్ర ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఈ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాన్ తో పాటు అంజలీ లావానియాల మద్య వచ్చే బెల్లీ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది.

సంఘమిత్రా ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డలు ఎంతు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ క్యారక్టరైజేషన్ అతని ముందు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. కలకత్తా మాఫియా నేపద్యంలో ఈ చిత్రం చాలా థ్రిల్లింగ్ గా సాగుతుందని, స్టైలిష్ ఎంటర్టైనర్ గా దర్సకుడు తీర్చి దిద్దాడని చెప్తున్నారు.కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్.

ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు:అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్:అనూవర్థన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X