జిల్లాల్లో పవన్‌ ఫ్యాన్స్ సందడి ఇలా...

By Srikanya

రాజమండ్రి : సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ అభిమానుల సందడి మొదలైంది. 14వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో పవన్‌ చేసే ప్రసంగాన్ని ప్రత్యేక స్కీన్‌ల ద్వారా ప్రజలకు వినిపిం'చడానికి వారు రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తన ఇమేజ్‌తో గెలుపు సాధ్యమనుకునే కొన్ని స్థానాల్లోనే పోటీకి దించాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం నియోజకవర్గాలను ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

పవన్‌కల్యాణ్‌ 'జనసేన' పేరిట కొత్త పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. ఈమేరకు పవన్‌ కల్యాణ్‌ సోమవారం ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈనెల 14న పార్టీ గుర్తు, జెండా, విధి విధానాలను ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు.

Pawan Kalyan New Political Party Name ‘Jana Sena’

ఈ నెల 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో పవన్‌కల్యాణ్ తన రాజకీయ అరంగేట్ర సభను నిర్వహించబోతున్నారు. ఈ సభకు భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మూడువేల మంది అభిమానులు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో పార్టీ విధివిధానాలను ప్రకటించడంతో పాటు ప్రపంచ సామాజిక, రాజకీయాంశాలపై పవన్‌కల్యాణ్ రాసిన పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు.

ఈ సమావేశంలో పవన్‌కల్యాణ్ ఒక్కరే ప్రసంగిస్తారని పాత్రికేయులతో ఎటువంటి ముఖాముఖి వుండదని తెలుస్తోంది. దాదాపు 45నిమిషాల పాటు ఆయన ప్రసంగం వుంటుందని, అందులో పలు సంచలన నిర్ణయాల్ని వెలువరిస్తారని అభిమానులు అంటున్నారు. ఈ సభలోనే పార్టీ తరపున పోటీ చేయబోయే 40మంది అసెంబ్లీ అభ్యర్థులు, 9మంది పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది. రాజకీయ అరంగేట్ర సభ తర్వాత మరో వారంరోజుల్లో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి పాత్రికేయుల ప్రశ్నలకు పవన్‌కల్యాణ్ సమాధానమిస్తారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X